కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)వ్యక్తిగత కార్యదర్శి( Personal Secretary)పీపీ మాధవన్‌పై రేప్ కేసు నమోదైంది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో సోనియా పర్సనల్ సెక్రెటరీ పీపీ మాధవన్(PP Madhavan)పై ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తమ్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఐపీసీలోని సెక్షన్‌లు 376, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వివరించారు. జూన్ 25న అందిన ఓ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
జూన్ 25న పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్ లో ఓ మహిళ..2018లో తన భర్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, కార్యక్రమాలకు హోర్డింగ్‌లు పెట్టేవాడని,తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాడని చెప్పారు...అయితే 2020 ఫిబ్రవరిలో తన భర్త చనిపోయిన తర్వాత తన ఆర్థిక పరిస్థితి దిగజారిందని తెలిపింది. 2020లో ఆయన మరణించే వరకు ఢిల్లీ కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌లలో లేబర్‌గా పని చేసేవాడని తెలిసింది. భర్త మరణంతో సహాయం కోసం కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పీపీ మాధవన్‌ని కలిసినట్లు బాధితురాలు తెలిపింది 'ఆ తర్వాత మాధవ తనకు జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని.. ఆ తర్వాత తనకు తరచుగా ఫోన్ కూడా చేస్తుండేవాడని తెలిపింది. ఈ ఏడాది జనవరిలో జాబ్ ఇంటర్వ్యూ గురించి తనకు మాధవన్ మెసేజ్ పంపించి..సురేంద్ర నగర్‌లోని ఓ ఇంటికి వెళ్లాలని సూచించాడని..అక్కడే తనపై మాధవన్ అత్యాచారానికి పాల్పడ్డాడని తన ఫిర్యాదులో బాధిత మహిళ తెలిపింది. అత్యాచారం విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని తనని బెదిరించారని బాధితురాలు చెప్పినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసుపై మాధవన్ స్పందించాడు. ఇవన్నీ నిరాధారమైన కేసులు అని, ఇది తనపై పన్నిన కుట్ర అని కొట్టిపారేశారు.
టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ లాంటిదే ఈ పోలీస్..డబ్బులిస్తే చాలు అడ్డమైన పనులన్నీ చేస్తది..అడ్డంగా దొరికి అరెస్ట్
కొంత మంది మనుషులు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటన ఉత్తరఖండ్ లో వెలుగులోనికి వచ్చింది. హరిద్వార్ లోని రూర్కిలో ఇద్దరు తల్లి కూతుళ్లు బైటకు వెళ్లారు. తమ ఇంటికి వెళ్లడానికి సమయానికి బస్సు రాలేదు. దీంతో వారు ఇతర వాహనాల కోసం ఎదురుచూస్తూన్నారు. ఇంతలో ఒక కారువచ్చి ఆగింది. లిఫ్ట్ కావాలా అని అడిగారు. బస్సు రాకపోవడంతో వారు కారులు ఎక్కారు. కారు ఎక్కినప్పటి నుంచి మహిళను బెదిరించారు. ఆరేళ్ల బాలికను కారులో ఒక పక్కన కూర్చో బెట్టుకుని ఆమెపై సాముహిక అత్యాచారం చేశారు. బాలిక ఏడుస్తున్న ఏమాత్రం కనికరించలేదు. తల్లిని కూడా కదల నివ్వకుండా పట్టుకున్నారు. కారులో ఐదారుగురు ఉండటంతో వారి పశుబలం మందు ఆమహిళ ఒడిపోయింది. వారిని ప్రతిఘటించలేక మూర్ఛబోయింది. ఈ క్రమంలో వారంతా పాపను.. అతి దారుణంగా అత్యాచారం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Rape case, Sonia Gandhi