సోనియాగాంధీ నిరసన.. రేపు బర్త్ డే వేడుకలు రద్దు...

డిసెంబర్ 9న ఆమె 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు.

news18-telugu
Updated: December 8, 2019, 3:34 PM IST
సోనియాగాంధీ నిరసన.. రేపు బర్త్ డే వేడుకలు రద్దు...
సోనియా గాంధీ (ఫైల్ చిత్రం)
  • Share this:
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ రేపు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండనున్నారు. డిసెంబర్ 9న ఆమె 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. అయితే, దేశవ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, హింసను ఖండిస్తూ ఆమె పుట్టినరోజు వేడుకలు చేసుకోకూడదని నిర్ణయించారు. ఇటీవల మహిళల మీద అఘాయిత్యాలు భారీగా పెరిగాయి. మొన్న హైదరాబాద్, నిన్న ఉన్నావ్‌లో మహిళల మీద ఘోరాలు జరిగాయి. దీనికితోడు రాహుల్ గాంధీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశం రేప్‌ల రాజధానిగా మారిపోయిందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>