• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • SONIA GANDHI LETTER TO PM MODI OVER COVID SITUATION SU

Sonia Gandhi Letter to PM Modi: ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ.. వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి..

Sonia Gandhi Letter to PM Modi: ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ.. వాటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి..

ప్రదాని మోదీ, సోనియా గాందీ(ఫైల్ పొటో)

దేశంలోని కరోనా పరిస్థితులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు.

  • Share this:
    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. కరోనా కేసులు పెరగుతున్న నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను సోనియా గాంధీ ఈ లేఖలో పేర్కొన్నారు. కోవిడ్-19 పరిస్థితులపై.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల మంత్రులతో తాను సుధీర్ఘంగా మాట్లాడినట్టు చెప్పారు. ప్రధానంగా 3 సమస్యలను సోనియా గాంధీ తన లేఖలో ప్రస్తావించారు. వాటిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అవసరమైన మేరకు కోవిడ్ వ్యాక్సిన్‌ డోసులను అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి ఉపయోగించే పరికరాలను, మెడిసిన్‌ను జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఒకవేళ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంక్షలు అమలు చేస్తే.. కూలీలు, పేదల కోసం minimum monthly guaranteed పథకాన్ని తీసుకురావాలని కోరారు.

    సోనియా గాంధీ లేఖలోని అంశాలు..
    1. వ్యాక్సిన్ అనేది కరోనా ఎదుర్కొవడానికి మన ముందున్న ఆశ. చాలా రాష్ట్రాల్లో కేవలం 3 నుంచి 5 రోజులకు సరిపడ మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ నిలువలు ఉన్నాయి.  ఓవైపు కోవిడ్ వ్యాక్సిన్ దేవీయ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, మరోవైపు తగిన సామర్థ్యం ఉన్న టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వడాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలస్యం చేయకుండా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే అర్హుల జాబితాను విస్తృతం చేయాలి. కేవలం వయసు ఆధారంగా మాత్రమే కాకుండా అవసరం ఆధారంగా కూడా అర్హులను టీకా అందేలా చూడాలి. వివిధ రాష్ట్రాలో కరోనా తీవ్రత, అక్కడి పరిస్థితులను ఆధారంగా చేసుకుని వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరగాలి.

    2. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి అవసరమైన అన్ని పరికరాలను, మెడిసిన్‌ను జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించాలి. వెంటిలేటర్లు, ఆక్సీ మీటర్లు, ఆక్సిజన్ సిలిండర్లపై జీఎస్టీ ఉంది. అలాగే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ Remdesivir, Dexamethazone పై కూడా.



    3. కర్ఫ్యూలు, ప్రయాణ ఆంక్షలు, మూసివేతలు, లాక్‌డౌన్‌ల ద్వారా పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని ప్రయత్నించినప్పుడు.. ఇప్పటికే ఇబ్బందులను గురైన ప్రజలను, ముఖ్యంగా పేదలు, రోజువారీ కూలీలను ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే minimum monthly guaranteed(కనీస నెలవారీ హామీ) పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరుతున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ. 6 వేలు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వలస కార్మికులకు వారు పనిచేసే చోటుతో పాటు, స్వరాష్ట్రాల్లో అవసరమైన పునవారసం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి.
    Published by:Sumanth Kanukula
    First published: