Home /News /national /

SONIA GANDHI BEING TREATED FOR RESPIRATORY INFECTION POST COVID SYMPTOMS SAYS CONGRESS MKS

Sonia Gandhi : సోనియా గాంధీకి శ్వాస‌కోశ ఇన్ఫెక్ష‌న్‌ -ఇబ్బందికరంగానే పరిస్థితి : Congress

సోనియా గాంధీ (పాత ఫొటో)

సోనియా గాంధీ (పాత ఫొటో)

సోనియా గాంధీ (75) ఆరోగ్య పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగానే ఉందని, ఆమెకు శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్ సోకిందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నదని జాతీయ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. వివరాలివే..

జాతీయ కాంగ్రెస్ (Congress) అధ్యక్షురాలు సోనియా గాంధీ (75) (Sonia Gandhi) ఆరోగ్య పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగానే ఉందని, ఆమెకు శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్ సోకిందని, కొవిడ్ (Covid) అనంతర సమస్యలతో బాధపడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నదని పార్టీ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. గడిచిన ఐదు రోజులుగా ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలోనే ఉన్న అధినేత్రి ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఇవాళ కీలక సమాచారం వెల్లడించారు.

కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శ్వాస‌కోశ ఇన్ఫెక్ష‌న్‌తో పాటు పోస్ట్ కొవిడ్ ల‌క్ష‌ణాల‌కు చికిత్స పొందుతున్నార‌ని, ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటున్నారని పార్టీ నేతలు తెలిపారు. క‌రోనా వైర‌స్ సోక‌డం, ముక్కు నుంచి ర‌క్త‌స్రావం కావ‌డంతో జూన్ 12న సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారాం ఆస్ప‌త్రిలో చేరారు.


Secunderabad Station ధ్వంసం : 71 రైళ్లు రద్దు : SCR -ప్రయాణికుల హాహాకారాలు.. ఇదీ సీన్..


ఆస్పత్రిలో చేరిన వెంటనే సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో సోనియాగాంధీకి దిగువ శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ గుర్తించిన వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. అలాగే సోనియాగాంధీ ఇతర పోస్ట్ - కోవిడ్ లక్షణాలకు సంబంధించిన చికిత్స కూడా పొందుతున్నారని జైరామ్ రమేష్ వెల్లడించారు.


Sai Pallavi | Vijayashanthi : సాయి పల్లవిపై విజయశాంతి అనూహ్య స్పందన.. అలాంటి సమాజంలో ఉన్నాం..


సోనియా గాంధీ ఆరోగ్యంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పార్టీ ఈ మేరకు ప్రకటన చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ముందు విచారణకు వెళ్లాల్సిన రాహుల్ గాంధీ.. తల్లి ఆరోగ్యం బాగోని కారణంగా ఆమెతో ఉండటానికి వాయిదా కోరగా అధికారులు అంగీకరించడం తెలిసిందే.
Published by:Madhu Kota
First published:

Tags: Congress, Covid, Sonia Gandhi

తదుపరి వార్తలు