SONAKSHI SINHA MOTHER POONAM SINHA RICHEST CANDIDATE IN PHASE 5 OF LS ELECTIONS DECLARES ASSETS WORTH RS 193 CRORE AK
దబాంగ్ భామ తల్లి ఆస్తుల విలువ రూ. 193 కోట్లు
శతృఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా
సమాజ్‌వాదీ పార్టీ తరుపున లక్నోలో పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.
ఐదో దశ లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్న బాలీవుడ్ వెటరన్ హీరో శత్రఘ్న సిన్హా భార్య, దబాంగ్ భామ సోనాక్షి సిన్హా తల్లి పూనమ్ సిన్హా తనకు రూ. 193 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్‌లో వెల్లడించారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల బరిలో శ్రీమంతులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఐదో దశ లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్న బాలీవుడ్ వెటరన్ హీరో శత్రఘ్న సిన్హా భార్య, దబాంగ్ భామ సోనాక్షి సిన్హా తల్లి పూనమ్ సిన్హా తనకు రూ. 193 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్‌లో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున లక్నో నుంచి పోటీ చేస్తున్న పూనమ్ సిన్హా... కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్‌తో తలపడనున్నారు. కొద్దిరోజుల క్రితమే సమాజ్‌వాదీ పార్టీలో చేరిన పూనమ్ సిన్హాకు లక్నో నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది ఆ పార్టీ.
శత్రఘ్న సిన్హా కాంగ్రెస్ తరపున బీహార్‌లోని పాట్నా నుంచి పోటీ చేస్తుండగా... పూనమ్ లక్నో నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటం గమనార్హం. ఇక ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ తరపున పోటీ చేస్తున్న విజయ్ కుమార్ మిశ్రా రూ. 177 కోట్లతో కోటీశ్వరుల జాబితాలో రెండో స్థానంలో నిలవగా, బీజేపీ అభ్యర్థి జయంత్ సిన్హా రూ. 77 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 188 మంది కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నారు.
గ్యాలరీ: బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.