కష్టపడితే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. కష్టే ఫలి అని ఊరికే అనలేదు పెద్దలు. అయితే కొంతమంది ఎంత కష్టపడినా అదృష్టం (Luck) కలసి రాకపోవడంతో ఎన్నో వైఫల్యాలను చవిచూసినవారు ఉన్నారు. ఇలా చిన్న తనం నుంచి కష్టపడిన వాళ్లే పెద్ద అయిన తర్వాత ఉన్నతులుగా మారారు. ఇలా ఎంతో మంది ఉన్నారు కూడా. ఎన్ని సమస్యలు ఎదురైతే మనుషులు అంత కఠినంగా తయారవుతారు. ఆటుపోట్లు ఎదుర్కొని ముందుకు సాగుతారు. పరాయజయాలు అలవాటు(Habbit) అయి పోయిన వారు.. వాటిని ఒక్కో ఇటుకలా పేర్చొకొని.. ఇంటిలా నిర్మించుకోవాలి. అలా అయితే విజయతీరాలకు చేరుతారు. ‘పట్టు పట్టరాదు.. పట్టి విడువరాదు’ అనేది వేమన పద్యం. ఇందులో ఏదైనా పని మొదలు పెడితే సాధించే వరకు వదిలి పెట్టకూడదు.. ఒక వేళ వదిలిపెట్టే ఆలోచన ఉంటే.. ఆ పనిని మొదలు పెట్టకపోవడమే మంచిది అనేది ఆ పద్యం యొక్క సారాంశం.
అయితే ఇక్కడ ఓ నిరుపేద యువకుడు గురించి చెప్పుకోవాలి. ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని.. ఎన్నో అపజయాలు మూటకట్టుకొని.. చివరకు నీటి ప్రవేశ పరీక్షలో 720 కి 626 మార్కులు సాధించి.. సీటు సంపాదించాడు. అంటే అతడు డాక్టర్ కాబోతున్నాడన్న మాట. ఈ విషయం తెలుసుకున్న తన తల్లిదండ్రలు (Parents), బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలా అతడు ఆ ఊరికే కాదు.. ఆ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దుధారామ్ అనే వ్యక్తి రాజస్థాన్ (Rajastan) లోని బార్మెర్లో పేద కుటుంబంలో పుట్టాడు. అతడి నివాసం కేవలం పూరి గుడిసెలోనే. తండ్రి భవన నిర్మాణం కూలీ. తన వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకోవడం చూసి దుధారామ్కి బాగా చదివి డాక్టర్ కావాలన్నది చన్నతనం నుంచి కల.
Dudharam, a resident of Barmer, Rajasthan, is now all set to become the first doctor from his village after scoring 626/720 in the #NEETUG2021. Despite the hardships he faced in his life, he studied hard to achieve his goal.https://t.co/X30eORfpxv@ibtimes_india @mansukhmandviya
— ALLEN Career Institute (@ALLENkota) November 26, 2021
ఇలా అతడు రాత్రి, పగలు కష్టపడ్డాడు. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. వెనక్కి తిరిగి చూడలేదు. దీంతో కష్టపడ్డదానికి ఫలితం కనిపించింది. NEETలో ఆల్ ఇండియాలో 9,375 ర్యాంక్ సాధించాడు. నాలుగో ప్రయత్నంతో ఇది సాధ్యమైంది. గ్రామంలో MBBS చేయనున్న తొలి వ్యక్తి అయ్యాడు. ఇక అతడు ఉంటున్న ఊరు సందారీ తెహసీల్. ఆ ఊరులో కేవలం 250 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. కరెంటు అంతంత మాత్రమే.
రోజుకు ఐదారు గంటలే ఉండేదట. టెన్త్, ఇంటర్లో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకున్న దుధారమ్లో టాలెంట్ గుర్తించిన స్కూల్ టీచర్ రాజేంద్ర సింగ్… డాక్టర్ చదవాలని ఎంకరేజ్ చేశారు. దాంతోనే అతడు దానికి తగ్గట్టూ ప్రిపేర్ కొనసాగించాడు. కోచింగ్ సెంటర్లో అతడికి 50 శాతం రాయితీ కూడా ఇచ్చి కోచింగ్ ఇచ్చారు. ఇలా అతడు నాలుగో ప్రయత్నంలో మెరుగైన ర్యాంక్ సాధించాడు. నీటి ర్యాంక్ సాధించడంతో తన తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. దీనికి సంబంధించి ట్వీట్టర్ ద్వారా అలీన్ కెరీర్ ఇనిస్టీట్యూట్ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.