హితేష్ సింగ్... అహ్మదాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో... ఫూడ్ అండ్ అగ్రి-బిజినెస్ మేనేజ్మెంట్లో రెండేళ్ల పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం చేయబోతున్నాడు. హితేష్ తండ్రి పంకజ్ సింగ్ ప్రస్తుతం గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (అమూల్)లో మేనేజింగ్ డైరెక్టర్‌కు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నిజానికి పంకజ్ సింగ్ కుటుంబం... బీహార్ నుంచీ గుజరాత్‌లోని ఆనంద్కి వలస వచ్చింది. మొదట్లో సెక్యూరిటీ గార్డుగా ఆయన పనిచేశారు. నెలకు వచ్చే జీతమెంతో తెలుసా... రూ.600 మాత్రమే. పేద కుటుంబం కావడంతో... మెరిట్ స్టూడెంటైనప్పటికీ హితేష్... గుజరాత్‌లోని మీడియం స్కూల్లో అంతంతమాత్రం చదువులే చదివాడు. కానీ ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథ్స్ సబ్జెక్టులు చదివి... 97 శాతం మార్కులు సంపాదించాడు. అతను బాగా చదువుకునేందుకు తల్లిదండ్రులు కూడా తోడ్పడేవారు. అలా హితేష్... IIMలో సీటు సంపాదించాలని డ్రీమ్ పెట్టుకున్నాడు.
తన మేనేజింగ్ డైరెక్టర్‌తో కలిసి... ఓసారి అహ్మదాబాద్ IIMకి వెళ్లిన పంకజ్ సింగ్... ఆ క్యాంపస్ చూసి... ఆశ్చర్యపోయాడు. అలాంటి ఇన్స్టిట్యూట్లో తన కొడుక్కి సీటు వస్తే బాగుండని అనుకున్నాడు. హితేష్ కూడా... తన తల్లిదండ్రులు తన చదువుల కోసం పడుతున్న కష్టం చూసి... ఎలాగైనా వాళ్లను ఆ కష్టాల నుంచీ బయట పడెయ్యాలని ప్రతి రోజూ పంతంతో చదివాడు. ప్రధాన అవరోధంగా ఉండే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టి దాని అంతు చూశాడు. ఫలితంగా IIM-A సీటు సంపాదించేందుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అతనికి అడ్డుగోడగా మారలేదు.
గుజరాత్‌కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వాటిలో డైరీ సెక్టార్ ఒకటి. IIMలో స్టడీ పూర్తయ్యాక... తాను డైరీ సెక్టార్ (పాల ఉత్పత్తి)లోనే తన కెరీర్ వెతుక్కుంటానంటున్నాడు హితేష్. అతనికి కంగ్రాట్స్ చెబుదాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.