హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Son Gift To mother : అమ్మ రిటైర్మెంట్ రోజున అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కొడుకు

Son Gift To mother : అమ్మ రిటైర్మెంట్ రోజున అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కొడుకు

హెలికాఫ్టర్ లో ఇంటికి వచ్చిన టీచర్

హెలికాఫ్టర్ లో ఇంటికి వచ్చిన టీచర్

Son Gift To mother : తల్లిదండ్రులు ఉద్యోగాల్లో పదవీ విరమణ(Retirement)పొందిన రోజున మొబైల్స్,బట్టలు,బంగారం వంటి కానుకలు పిల్లలు ఇవ్వడం సహజం. అయితే రాజస్తా​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన తల్లి రిటైర్మ్​మెంట్​ రోజు జీవితాంతం గుర్తుండిపోయేలా గిఫ్ట్​ ఇచ్చాడు.

ఇంకా చదవండి ...

Son Gift To mother : తల్లిదండ్రులు ఉద్యోగాల్లో పదవీ విరమణ(Retirement)పొందిన రోజున మొబైల్స్,బట్టలు,బంగారం వంటి కానుకలు పిల్లలు ఇవ్వడం సహజం. అయితే రాజస్తా​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన తల్లి రిటైర్మ్​మెంట్​ రోజు జీవితాంతం గుర్తుండిపోయేలా గిఫ్ట్​ ఇచ్చాడు. తల్లికి కుమారుడు ఇచ్చిన గిఫ్ట్ చూసి నెటిజన్ల శభాష్ అంటున్నారు. ఆ కుమారుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రాజస్తాన్(Rajastan)రాష్ట్రంలోని అజ్మీర్​ లోని తోప్​బ్రా గ్రామంలో నివసించే సుశీలా చౌహాన్ కేసర్​పురా గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా సేవలందిస్తున్నారు. అయితే 33 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన ఆమె శనివారం రిటైర్(Retired)అయ్యారు. తన తల్లి పదవీ విరమణ కార్యక్రమం నేపథ్యంలో అమెరికాలో ఉన్న సుశీలా కుమారుడు యోగేష్ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. పదవీ విరమణ రోజున తన తల్లికి జీవితాంతం గుర్తిండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిన యోగేష్ అందుకోసం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశాడు. శనివారం సుశీలా చౌహాన్​ పదవీ విరమణ కార్యక్రమం పూర్తయ్యాక ఆమెను అక్కడి నుంచి స్వగ్రామమైన తోప్​బ్రా కు హెలికాప్టర్​లో తీసుకెళ్లాడు కుమారుడు యోగేష్.

Kiara advani birthday: అందాల బొమ్మ కియారా బర్త్ డే..కియారా లైఫ్ గురించి కొన్ని ప్రత్యేక విషయాలు

గ్రామంలోకి హెలికాప్టర్​ రాగానే చూసేందుకు ప్రజలంతా అక్కడికి చేరుకున్నారు. తన కొడుకు తనకు హెలికాప్టర్​లో గ్రామానికి తీసుకురావడం చాలా సంతోషంగా అనిపించిందని సుశీలా తెలిపారు. ఈ సందర్భంగా యోగేష్ మాట్లాడుతూ..."రెండు సంవత్సరాల క్రితం నా భార్య ఆడపిల్లకు జన్మనిచ్చింది. నా కుమార్తెను స్వగ్రామానికి మొదటి సారి కిషన్​గఢ్​ ఎయిర్​పోర్ట్ ​నుంచి తోప్​బ్రా ప్రాంతానికి హెలికాప్టర్​లో తీసుకురావలనేది అమ్మ కోరిక. కానీ అది కొన్ని కారణాలతో కుదరలేదు. అందుకే అమ్మకు సర్​ఫ్రైజ్​ ఇస్తూ కేసర్​పురా నుంచి తోప్​బ్రా ప్రాంతానికి హెలికాప్టర్ ​లో తీసుకొచ్చాను.ఇంత మంది జనం వస్తారని ఊహించలేదు, కానీ చాలా బాగుంది"అని తెలిపారు.

First published:

Tags: Helicopter, Rajastan