Home /News /national /

SOMANATH TEMPLE RELIGIOUS TOURISM WILL CREATE EMPLOYMENT ENSURE FUTURE GENERATIONS REMAIN CONNECTED TO TRADITION SAYS PM MODI SK

Somnath Projects: ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్ద పీట.. సోమ్‌నాథ్‌లో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ

సోమనాథ్ ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ

సోమనాథ్ ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని మోదీ

ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. బీజేపీ నేత కేశూభాయ్ పటేల్ మరణం తర్వాత మోదీకి ఈ పదవి లభించింది. హోం మంత్రి అమిత్ షా, ఎల్‌కే అద్వానీ వంటి ప్రముఖులు ఇతర ధర్మకర్తలుగా ఉన్నారు.

    ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనేక ప్రాజెక్టులతో పాటు పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంతరించుకుంది. తాజాగా గుజరాత్‌లోని సోమనాథ్‌లో వివిధ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఇవాళ ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టుల ప్రారంభోత్సవంతో పాటు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు సోమనాథ్ ప్రొమెనేడ్, సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్, పాత (జునా) సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి పార్వతీదేవి దేవాలయానికి శంకుస్థాపన చేస్తారు. PRASHAD (పిలిగ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్, హెరిటేజ్ ఆగుమెంటేషన్ డ్రైవ్) పథకం కింద సోమనాథ్ ప్రొమెనేడ్‌ను రూ.47 కోట్లకు పైగా ఖర్చుతో అభివృద్ధి చేశారు.

    '' సోమనాథ్ ఆలయ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్నందుకు నేను అదృష్ట వంతుడిని. ఈ పవిత్రమైన క్షేత్రానికి సేవ చేసే భాగ్యం దక్కింది.  ఆధ్మాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దాని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు మన గతానికి సంబంధించిన జ్ఞానం లభిస్తుంది. భయం కారణంగా నమ్మకాలు సన్నగిల్లలేవు. ఆధ్యాత్మిక పర్యాటకం వలన మన యువత దేశ సంస్కృతి , సంప్రదాయాల గురించి తెలుసుకుంటారు. .'' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.



    సోమనాథ్ ఎగ్జిబిషన్ సెంటర్‌ను 'టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్' ప్రాంగణంలో అభివృద్ధి చేశారు. పాత సోమనాథ్ దేవాలయానికి చెందిన కొన్ని శిథిల భాగాలు, నాగరిక శైలిలో రూపొందించిన పురాతన దేవాలయ శిల్పాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ద్వారా మొత్తం రూ.3.5 కోట్లతో పాత (జునా) సోమనాథ్ ఆలయ ప్రాంగణాన్ని పునర్నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న పాత ఆలయాన్ని ఇండోర్ రాణి అహల్యాబాయి అప్పట్లో అభివృద్ధి చేశారట. అందుకే ఈ ఆలయాన్ని అహల్యాబాయి దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే యాత్రికుల సంఖ్య గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. దీంతో యాత్రికుల భద్రతను, పెరిగిన సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం పాత ఆలయ సముదాయాన్ని అభివృద్ధి చేశారు.

    పార్వతీదేవి ఆలయాన్ని మొత్తం రూ.30 కోట్లతో నిర్మించాలని నిర్ణయించారు. సోంపుర సలాత్ శైలిలో ఈ దేవాలయాన్ని నిర్మించనున్నారు. దీంతోపాటు నాట్య మండపం, గర్భ గృహ అభివృద్ధి పనులను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పాటు కేంద్ర పర్యాటక మంత్రి, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

    ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ ట్రస్ట్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. బీజేపీ నేత కేశూభాయ్ పటేల్ మరణం తర్వాత మోదీకి ఈ పదవి లభించింది. హోం మంత్రి అమిత్ షా, ఎల్‌కే అద్వానీ వంటి ప్రముఖులు ఇతర ధర్మకర్తలుగా ఉన్నారు. ఈ ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రధాని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో పూర్తయిన ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.

    ఇవి కూడా చదవండి:

    Success story: 39 ఏళ్ల వయసులో ఆర్మీలో చేరిన సాఫ్ట్​వేర్ ఇంజినీర్​.. స్ఫూర్తిదాయక జర్నీ

    షాకింగ్.. భారత దౌత్య కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు.. చివరకు వాటిని తీసుకెళ్లి పోయారు
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Gujarat, Narendra modi, Tourism

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు