Home /News /national /

SOLURU GADDUGE MATH SWAMIJI LEFT MONASTICISM HAS GONE MISSING WITH A GIRL PVN

Swamiji Missing : పెళ్లైన మహిళతో స్వామీజీ పరార్..సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు!

శివమహంత్ స్వామీజీ(ఫైల్ ఫొటో)

శివమహంత్ స్వామీజీ(ఫైల్ ఫొటో)

Swamiji Missing : కర్ణాటక(Karnataka)లో ఓ స్వామీజీ అమ్మాయితో కలిసి పారారైన విషయం ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రామనగర్ లోని మగాడి తాలూకాలోని గడ్డుగే మఠం(సోలూరు)కి చెందిన శివమహంత్ స్వామీజీ సన్యాసం త్యజించి అదృశ్యమయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Swamiji Missing : కర్ణాటక(Karnataka)లో ఓ స్వామీజీ అమ్మాయితో కలిసి పారారైన విషయం(Swamiji escape with girl) ఇప్పుడు ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. రామనగర్ లోని మగాడి తాలూకాలోని గడ్డుగే మఠం(సోలూరు)కి చెందిన శివమహంత్ స్వామీజీ సన్యాసం త్యజించి అదృశ్యమయ్యారు. తాను మఠం ఎందుకు విడిచిపెట్టానో లేఖ రాసి కారణాన్ని కూడా చెప్పాడు. స్వామీజీ అదృశ్యమైన విషయం తెలిసి మఠంలోని భక్తులు, గ్రామస్తులు అందరూ షాక్ అయ్యారు.

ఓ వివాహితతో యువతితో స్వామీజీ పరారైనట్లు మఠంలోని భక్తులలో, గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఈ స్వామీజీ అసలు పేరు హరీష్. రెండేళ్ల క్రితమే మఠానికి అధిపతిగా నియమితులయ్యారు. ఇప్పుడు పెళ్లయిన నెలన్నరకే అయిన ఓ వివాహిత యువతితో పారిపోయాడనే ప్రచారం జరుగుతోంది. తనకు సన్యాసం అంటే ఇష్టం లేదని,అందుకే మఠం వదిలి పారిపోతున్నానని,తనను వెతికే ప్రయత్నం చేయవద్దంటూమఠంలో ఓ లేఖ వదిలి వెళ్లారు శివమహంత్ స్వామీజీ.

Shocking : కలిసి ఉందామనుకున్న క్షణాల్లోనే..కోర్టులోనే భార్యను గొంతుకోసి చంపిన భర్త

నేను నా స్వామీజీ జీవితాన్ని వదులుకుంటున్నాను. కారణం నా జీవితంలో శాంతి లేదు. ఈ జీవితం నాకు అసూయ కలిగించింది. ఈ కారణం మీకందరికీ తెలుసని అనుకుంటున్నాను. దయచేసి నన్ను వెతకడానికి ప్రయత్నించవద్దు. నేను ఖాయయం బట్టలు వదులుకున్నాను, మళ్లీ వాటిని ధరించలేదు. నన్ను కనుక్కోవాలని ప్రయత్నిస్తే నా శక్తి ఏంటో చూస్తారని స్వామీజీ లేఖలో హెచ్చరించారు.



అయితే ఇంతకు ముందు ఇదే స్వామీజీ వేరే మఠంలో ఉన్నప్పుడు ఓ యువతితో ప్రేమలో పడ్డాడని చెబుతున్నారు. ఆమెకు నెల రోజుల క్రితమే పెళ్లయిందని చెబుతున్నారు. శివమహాంతస్వామి అలియాస్ హరీష్ అదే మహిళతో పరారీలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కుదురు పోలీస్ స్టేషన్‌లో స్వామీజీ మిస్సింగ్ కేసు నమోదైంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Karnataka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు