సూర్యుడిని కుక్క మింగేస్తుందా...బల్లి లాంటి మనిషి భూమ్మీదకు వస్తాడా...గ్రహణం వేళ నమ్మకాలివే..

సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించడం వల్ల ఏర్పడే ఖగోళ అద్భుతం గ్రహణం. దీనిపై నేటికీ మన సమాజంలో మూఢ నమ్మకాలు, అపోహలు కనిపిస్తూనే ఉన్నాయి. అవేంటో చూద్దాం...

news18-telugu
Updated: June 21, 2020, 10:31 AM IST
సూర్యుడిని కుక్క మింగేస్తుందా...బల్లి లాంటి మనిషి భూమ్మీదకు వస్తాడా...గ్రహణం వేళ నమ్మకాలివే..
సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించడం వల్ల ఏర్పడే ఖగోళ అద్భుతం గ్రహణం. దీనిపై నేటికీ మన సమాజంలో మూఢ నమ్మకాలు, అపోహలు కనిపిస్తూనే ఉన్నాయి. అవేంటో చూద్దాం...
  • Share this:
మరోసారి ఖ‌గోళంలో ఈ దశాబ్దంలో మొట్టమొదటిసారిగా కంటికి కనిపించే జ్వాలావలయ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే, దేశ‌వ్యాప్తంగా సంపూర్ణ స్థాయిలో ఉండ‌దు.. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా క‌నిపించ‌బోతోంది. విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 గంట‌ల‌ నుండి మధ్యాహ్నం 3.04 గంట‌ల వ‌ర‌కు ఉంటుంది వెల్ల‌డించారు. తెలంగాణలో ఉద‌యం 10.15 గంటల నుండి మ‌ధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం మాత్ర‌మే ఉంటుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉద‌యం 10.21 గంటల నుండి మ‌ధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం క‌న‌బ‌డుతుంది. మ‌రోవైపు, గ్రహణం సమయంలో తినకూడదు,.. గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు అని మూఢనమ్మకాలు ప్రచారం చేస్తున్నార‌ని.. ఇవన్నీ అబద్ధం.. ఇలాంటివి న‌మ్మ‌కూడ‌ద‌ని... ఈ ఖ‌గోళ అద్భుతం గురించి ప్లానిటరీ సొసైటీ సైంటిస్ట్ రఘునందన్ పేర్కొన్నారు. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించడం వల్ల ఏర్పడే ఖగోళ అద్భుతం గ్రహణం. దీనిపై నేటికీ మన సమాజంలో మూఢ నమ్మకాలు, అపోహలు కనిపిస్తూనే ఉన్నాయి. అవేంటో చూద్దాం...

భారత్‌లో ప్రచారంలో ఉన్న మూఢనమ్మకం ఇదే...

పురాణాల్లో రాహు కేతువులనే అసురులు సూర్య చంద్రులను మింగడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయని ప్రచారం ఉంది. అయితే నిజానికి భూమి, సూర్యుడు మధ్యలో చంద్రుడు తన కక్ష్యలో పరిభ్రమిస్తున్న సమయంలో ఒక సందర్భంలో సూర్యుడికి, భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా రావడం వల్ల ఆయా ప్రాంతాల్లో చంద్రుడి నీడ పడటం వల్ల గ్రహణం ఏర్పడుతుంది. ఈ నీడ రాహువు వల్ల ఏర్పడిందని నమ్ముతారు. అయితే వాస్తవానికి రాహువు అనే గ్రహం ఖగోళ శాస్త్రం ప్రకారం వ్యాప్తిలో లేనే లేదు.

అమెరికాలో మూఢనమ్మకం ఇదే...
శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో ఎంతో ప్ర‌గ‌తి సాధించిన అమెరికాలోనూ మూఢ‌న‌మ్మ‌కాలు బలంగా ఉన్నాయి. గ్రహణం రోజున ‘బల్లి మనిషి’ ఎదురుకావచ్చని అక్కడి ప్రజల నమ్మకం. 1988లో క్రిస్టోఫర్ డేవిడ్ అనే వ్యక్తి బల్లి మనిషిని చూశాడని అక్క‌డి వారి న‌మ్మ‌కం. అత‌డు విచిత్రంగా ఉన్నాడ‌ని అప్పట్లో ఈ వార్త అంతర్జాతీయంగా హ‌ల్‌చ‌ల్ చేసింది. సూర్యగ్రహణం రోజున అతడి నుంచి త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డానికి అంద‌రూ నల్లని టీ షర్టులు ధరించాలనే ఓ వార్త‌ కూడా అక్క‌డ‌ వైర‌ల్‌గా మారింది.

పశ్చిమాసియా దేశాల్లో మూఢనమ్మకం ఇదే...
పశ్చిమ ఆసియాలో గ్రహణం సమయంలో ఒక డ్రాగన్ సూర్యుడిని మింగేయడానికి ప్రయత్నిస్తుందని, అందుకే, దాన్ని తరిమేయడానికి గ్రహణం సమయంలో డోలు బాజా మోగిస్తారు.చైనాలో మూఢనమ్మకం ఇదే...
చైనాలో స్వర్గానికి చెందిన ఒక కుక్క సూర్యుడిని మింగేసేందుకు ప్రయత్నిస్తుందని అందుకే గ్రహణం ఏర్పడుందని భావిస్తున్నారు.

గ్రీసులో మూఢనమ్మకం ఇదే...
సూర్య గ్రహణం సమయంలో ఆకాశంలో ఒక తోడేళ్ల జంట సూర్యుడిపై దాడి చేస్తుందని గ్రీసు పురాణాల్లో నమ్ముతారు.

యూరప్ దేశాల్లో మూఢనమ్మకం ఇదే..
మధ్యయుగంలో యూరప్‌ ప్రజలు సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణాన్ని బైబిల్‌లో ప్రళయంగా భావించేవారు. యుగాంతం రోజున సూర్యుడు పూర్తిగా నల్లగా మారుతాడని, చంద్రుడు ఎర్ర రంగులో కనిపిస్తాడని బైబిల్లో ప్రస్తావన ఉంది.

శాస్త్రవేత్తలు ఏమన్నారంటే...
నేటికీ మన సమాజంలో మూఢ నమ్మకాలు, అపోహలు కనిపిస్తూనే ఉన్నాయి. గ్రహణం సమయంలో రేడియేషన్‌ వెలువడుతుందని, గర్భిణులు బయటకు రాకూడదని, గ్రహణం మొర్రి పిల్లలు పుడతారని మూఢనమ్మకాలు ప్రచారం చేస్తుంటారు. గ్రహణం పట్టే సమయంలో ఆహారం తీసుకుంటే జీర్ణకోశంపై చెడు ప్రభావం కలుగుతుందని కొందరు అంటారు. అయితే ఇవన్నీ నిజం కాదని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కొట్టి పారేశారు.
First published: June 21, 2020, 10:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading