• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • SNIFFER DOG AWARDED COP OF THE MONTH IN CHHATTISGARHS RAIGARH SK

ఇది కుక్క కాదు.. ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్.. ప్రతిష్టాత్మక అవార్డ్‌తో సత్తా

ఇది కుక్క కాదు.. ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్.. ప్రతిష్టాత్మక అవార్డ్‌తో సత్తా

స్నైఫర్ డాగ్ రూబీ

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సరాన్‌గఢ్ రాయల్ ప్యాలెస్ చోరీ కేసును కూడా రూబీ సాయంతో ఛేేదించారు పోలీసులు. అందుకే రూబీని కాప్ ఆఫ్ ది మంత్‌గా ప్రకటించారు.

  • Share this:
    పోలీస్ కేసుల్లో స్నైఫర్ డాగ్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి. కేసుకు సంబంధించి ఆధారాల సేకరణలో పోలీస్ కుక్కలు ముందుంటాయి. ఏదైనా మర్డర్ జరిగినప్పుడు నిందితుడిని గుర్తించాలన్నా.. ఎక్కడైనా బాంబు పెడితే పసిగట్టాలన్నా స్నైఫర్ డాగ్స్ ఉండాల్సిందే. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కీలకంగా వ్యహరించే ఓ స్నైఫర్ డాగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఓ కేసు ఛేదనలో ముఖ్య పాత్ర పోషించినందుకు.. రూబీ అనే స్నైఫర్‌డాగ్‌కు ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖ.. 'కాప్ ఆఫ్ ది మంత్' అవార్డు ప్రకటించింది. కుక్కకు అవార్డు ప్రకటించడం ఇదే తొలిసారి. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న ఆ కుక్క పేరు ఇప్పుడు అంతటా మార్మోగిపోతోంది.

    రూబీ అనే స్నైఫర్ డాగ్.. రాయ్‌గఢ్ జిల్లాలో ఎన్నో ముఖ్యమైన కేసుల చేధనలో పోలీసులకు సాయం చేసింది. సంచలనం సృష్టించిన సరాన్‌గఢ్ రాయల్ ప్యాలెస్ చోరీ కేసును కూడా రూబీ సాయంతో ఛేేదించారు. అందుకే రూబీని కాప్ ఆఫ్ ది మంత్‌గా ప్రకటించారు. దీనిపై రాయగఢ్ ఎస్పీ సంతోష్ సింగ్ మాట్లాడుతూ.. ''మంచిగా పనిచేసే పోలీస్ సిబ్బందిని ప్రతినెలా ప్రోత్సహించడం అనవాయితీగా వస్తోంది. వారి ఫొటోలను పలు పోలీస్ స్టేషన్‌లోనూ ఏర్పాటుచేయంతో పాటు నగదు ప్రోత్సాహాలు అందజేస్తాం. ఈ నెల ఇద్దరికి అవార్డు వచ్చింది. ఒకరు లీగల్ సెక్షన్ ఆఫీసర్ కాగా మరొకరు డాగ్ హాండ్లర్ వీరేంద్ర. వీరితో పాటు స్నైఫర్ డాగ్ రూబీకి కూడా కాప్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక చేశాం.'' అని పేర్కొన్నారు.


    పేలుడు పదార్థాలు, అక్రమ మాదక ద్రవ్యాలు, కరెన్సీ, రక్తం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వాసన ద్వారా పసిగట్టేలా.. ప్రత్యేక శిక్షణ పొందిన కుక్కలను స్నైఫర్ డాగ్స్ అని పిలుస్తారు. ఇటీవలే సరాన్‌గఢ్ రాజ్‌మహల్‌లో రూ. లక్షల విలువైన రెండు వెండి ట్రేలు చోరీకి గురయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో రూబీ ముఖ్య భూమిక పోషించింది. రూబీ సాయంతోనే పోలీస్ అధికారి వీరేంద్ర.. వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని కేసుల ఛేదనలోనూ పోలీసులకు సాయం చేసింది. ఈ క్రమంలోనే రూబీకి కాప్ ఆఫ్ ది మంత్ అవార్డు వచ్చింది.
    Published by:Shiva Kumar Addula
    First published: