SNAKES SHOULD BE GIVEN AS DOWRY TO THE BRIDEGROOM VRY
Snake Dowry : వింత అచారం..! 21 పాములను కట్నంగా ఇస్తే కాని.. అక్కడ పెళ్లి కాదు..
ప్రతీకాత్మక చిత్రం
Snake Dowry : కట్నం పలు రకాలు.. దేశంలో కట్నం లేకుండా పెళ్లిలు కావడం కొంచెం కష్టమే అయితే ఈ కట్నం అనేది ఓ తెగలో వింతగా మారింది. వరుడికి 21 పాములను కట్నంగా ఇస్తే గాని అక్కడ పెళ్లి కాదు. దీంతో పాములనే కట్నంగా ఇస్తూ పెళ్లిల్లు చేస్తున్నారు.
చట్టపరంగా కట్నాలు తీసుకోవడం, ఇవ్వడం నేరం. కాని సామాజిక ఆ రుగ్మత మాత్రం పోవడం లేదు.. పైగా రాను రాను కట్నాలు అనే కాన్సెప్ట్ కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. గతానికే భిన్నంగా పెళ్లిల్లు జరుగుతున్నా.. కుటుంబాల మధ్య ఉండే ఆర్థిక స్థోమతను బట్టి పెళ్లిలు జరుగుతున్నాయి.. వాళ్ల వాళ్ల స్థాయిలో బయటకు కనపడకుండా కట్నాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు.
అయితే ఈ కట్నాలు ఒక్కో ప్రాంతలో ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని ప్రాంతల్లో నగదు రూపంలో ఉంటే మరి కొన్ని ప్రాంతంలో వస్తువుల రూపంలో ఉంటాయి.. కాని.. దేశంలోని ఓ తెగలో మాత్రం వింతగా కట్నాలు ఉన్నాయి. వారు చేసుకునే వృత్తికి సంబంధించి వాటినే కట్నంగా ఇస్తారట..! అవి కూడా 21 పాములను కట్నంగా ఇస్తారు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని గౌరియా తెగవారు ఈ వింత ఆచారాన్ని శతాబ్ధాలుగా అనుసరిస్తున్నారు. పాములు పట్టి జీవనం సాగించే ఈ తెగ తమ కూతురుని చేసుకోబోయే వ్యక్తికి వరకట్నంగా 21 విషసర్పాలు ఇస్తారు. ఈ తెగవారు పాములను నమ్ముకొని ఉంటారు.. పట్టణాల్లో పాములు ఆడిస్తూ వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. ఇక వరుడికి ఇచ్చిన పాములతో అతడు తన కుటుంబాన్ని పోషించుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా తనకు ఇచ్చిన పాములను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వరుడిపైనే ఉంటుంది. పాము బుట్టలో మరణిస్తే అది అశుభంగా భావిస్తారు.. కుటుంబ సభ్యులు గుండు చేయించుకొని క్రతువులు నిర్వహిస్తుంటారు. ఇలా వింత ఆచారం ఉండడంతో ఆతెగ వారు రాష్ట్రంలో ప్రత్యేకంగా నిలిచారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.