ఈవీఎంలో పాము... ఆగిన పోలింగ్

ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్ బాక్స్‌లో పాము ప్రత్యక్షమైంది. దీంతో అధికారులు కొంతసేపు టెన్షన్ పడ్డారు. కేరళలోని కన్నూర్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

news18-telugu
Updated: April 23, 2019, 1:56 PM IST
ఈవీఎంలో పాము... ఆగిన పోలింగ్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 23, 2019, 1:56 PM IST
ఈవీఎం యంత్రాలకు అనుబంధంగా ఉండే వీవీప్యాట్ బాక్స్‌లో పాము ప్రత్యక్షమైంది. ఈ ఘటనతో ఎన్నికల సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొద్దిసేపు ఓటింగ్‌ను నిలిపేశారు. కేరళలోని కన్నూర్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పామును తొలగించిన అనంతరం ఓటింగ్ ప్రక్రియను అధికారులు కొనసాగించారు. అయితే వీవీప్యాట్‌ బాక్స్‌లో పాము లేదని... అది పోలింగ్ బూత్‌లోకి వచ్చిన పాము అని జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు. పోలింగ్ బూత్‌లోకి పాము వచ్చిన వెంటనే అప్రమత్తమై దాన్ని అక్కడి నుంచి తొలగించామని తెలిపారు. మూడో దశలో భాగంగా జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా కన్నూర్ లోక్ సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. లెఫ్ట్ పార్టీ తరపున పీకే శ్రీమతి, కాంగ్రెస్ తరపున సుదీంద్రన్, బీజేపీ తరపున పద్మనాభన్ కన్నూర్ నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...