Home /News /national /

SMRITI IRANI SLAMS CONGRESS LEADERS RAHUL GANDHI OVER HER DAUGHTERS ILLEGAL BAR IN GOA SK

Smriti Irani: నా కూతురు చేసిన తప్పు ఇదే.. బార్ వివాదంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్ట్రాంగ్ రియాక్షన్

స్మృతి ఇరానీ

స్మృతి ఇరానీ

Smriti Irani: 18 ఏళ్ల వయసున్న తన కూతురు కాలేజీలో చదువుకుంటోందని.. అలాంటి ఆడపిల్ల పరువును బజారు కీడ్చుతారా? అంటూ స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనను టార్గెట్ చేశారని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఆమె మండిపడ్డారు

ఇంకా చదవండి ...
    కేంద్రమంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani) కుమార్తె జోయిష్ ఇరానీ(Zoish Irani) గోవా (Goa)లో చట్టవిరుద్ధంగా బార్ నిర్వహిస్తున్నారని... స్మృతి ఇరానీని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని కాంగ్రెస్ చేసిన విమర్శలపై తీవ్ర దుమారం రేగుతోంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 18 ఏళ్ల వయసున్న తన కూతురు కాలేజీలో చదువుకుంటోందని.. అలాంటి ఆడపిల్ల పరువును బజారు కీడ్చుతారా? అంటూ స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనను టార్గెట్ చేశారని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కోర్టులోనే తేల్చుకుంటామని.. కాంగ్రెస్‌ నేతలకు గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు స్మృతి ఇరానీ.

    ''నా కూతురు కాలేజీలో చదువుతోంది. ఆమె ఎలాంటి బార్‌ను నడపడం లేదు. కానీ కాంగ్రెస్ నేతలు పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఆమె పరువును బజారుకీడ్చుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై తన తల్లి పోటీ చేయడమే నా కూతురు చేసిన తప్పు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసిన రూ.5,000 కోట్ల దోపిడీ గురించి మాట్లాడినందుకే మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఈ వ్యవహారంపై కోర్టులోనే తేల్చుకుంటాను. నా కూతురుపై అభాండాలు వేస్తున్న ఆ వ్యక్తికి చెబుతున్నా. నీకు దమ్ముంటే 2024 ఎన్నికల్లో పోటీచెయ్యి. మళ్లీ ఓడించి ఇంటికి పంపిస్తాను. ఒక కార్యకర్తగా.. ఒక తల్లిగా ఛాలెంజ్ చేస్తున్నా.'' అని ఘాటు పదజాలంతో రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు స్మృతి ఇరానీ.






    కాగా, గోవాలో స్మృతి ఇరానీ కూతురు చట్టవిరుద్ధంగా బార్ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించిన విషయం తెలిసిందే. 2021 మేలో మరణించిన ఓ వ్యక్తి పేరిట జూన్ 2022లో మంత్రి కుమార్తె లైసెన్స్ పొందారని వారు ఆరోపించారు. 13 నెలల క్రితం మరణించిన వ్యక్తి పేరు లైసెన్స్ ఉండటం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. గోవా చట్టాల ప్రకారం.. ఒక రెస్టారంట్‌కు ఒక బార్ లైసెన్స్ మాత్రమే ఉండాలి. కానీ సిల్లీసోల్స్ గోవా రెస్టారెంట్‌కు రెండు ఉన్నాయని విమర్శించారు. అక్రమ లైసెన్స్ వ్యవహారంలో సదరు బార్‌కు అధికారులు నోటీసులు కూడా ఇచ్చారని.. ఐతే ఆ అధికారిని కూడా బదిలీ చేశారని ఆరోపణలు గుప్పించారు. స్మృతి ఇరానీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి.. ఈ పనులు చేశారని విమర్శించారు. అందువల్ల స్మృతి ఇరానీని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరోపణలను స్మృతి ఇరానీ కూతురు తరపు లాయర్ కూడా తీవ్రంగా ఖండించారు. సిల్లీసోల్స్ గోవా పేరిట తన క్లయింట్‌కు ఎలాంటి బార్ లేదని స్పష్టం చేశారు.



    ఈ వివాదంపై రాహుల్ గాంధీ స్వయంగా స్పందించడ మరింత దుమారానికి దారితీసింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై స్మృతి ఇరానీ చేసిన విమర్శల గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించడంతో ఆయన కూడా ఘాటుగా స్పందించారు. ఒక వార్తా పత్రికను నడిపే వ్యక్తికి, గోవాలో అక్రమంగా బార్ నడుపుతోన్న వ్యక్తికి ఎలాంటి పోలిక తీసుకురాలేమని ఎద్దేవా చేశారు. ఆమెకు తెలీకుండా, ఆమె పేరు ఉపయోగించకుండానే ఈ లైసెన్స్ వచ్చిందా..? మీడియాను లోపలికి రానీయకుండా ఆ రెస్టారెంట్ చుట్టూ బౌన్సర్లను ఎందుకు మోహరించారు? ఈ అక్రమ కార్యకలాపాల వెనుక ఎవరున్నారో తేలాలి? అని విమర్శించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Congress, Goa, Rahul Gandhi, Smriti Irani

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు