మీ సైజ్ ఎంత? ప్రశ్నిస్తున్న స్మృతి ఇరానీ

ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అంచనా వేసే అవకాశం లేకుండా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్వయంగా ప్రకటించారు. అదేంటో గబగబా తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: January 21, 2019, 6:17 AM IST
మీ సైజ్ ఎంత? ప్రశ్నిస్తున్న స్మృతి ఇరానీ
స్మృతి ఇరానీ
  • Share this:
విషయం సింపుల్... కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘సైజ్‌ ఇండియా’ అనే స్కీం తెస్తోంది. ఇదేంటంటే... ఇప్పటివరకూ మనం మన డ్రెస్సులకు విదేశీ కొలతల్నే పాటిస్తున్నాం. ఆ దేశాలు ఏ కొలతలతో డ్రెస్సులు తయారు చేస్తు్న్నాయో మనమూ అదే కొలతల్ని ఫాలో అవుతున్నాం. అది ఎందుకు నచ్చలేదో గానీ కేంద్రం మనకంటూ కొత్త కొలతలు ఉండాలని డిసైడైంది. అందువల్ల భారతీయ రెడీమేడ్‌ దుస్తుల పరిశ్రమకు త్వరలో సొంత ప్రామాణిక కొలతలు రాబోతున్నాయి. అందుకోసం దేశమంతా వర్తించేలా ‘సైజ్‌ ఇండియా’ స్కీంని కేంద్రం త్వరలోనే అమల్లోకి తేబోతోంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు.

అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు తమకంటూ ప్రత్యేక కొలతల్ని పెట్టుకున్నారు. అంటే స్మాల్, మీడియం, లార్జ్ (L), ఎక్స్‌ట్రా లార్జ్ (XL), 45, 44 వంటివన్నమాట. మనం చాలా విషయాల్లో వాళ్లను ఫాలో అవుతున్నాం కదా. డ్రెస్సుల కొలతల్లోనూ కంటిన్యూ అయిపోతున్నాం. ఎందుకో కేంద్ర ప్రభుత్వానికి అది నచ్చలేదు. మనకు కూడా సొంత కొలతలు ఉండాలని భావించింది. స్మృతి ఇరానీ ఆ కొలతల్ని డిసైడ్ చేసే పనిలో పడ్డారు. అందువల్ల త్వరలోనే భారతీయ జౌళి, రెడీమేడ్‌ దుస్తుల పరిశ్రమకు స్టాండర్డ్ మెజర్‌మెంట్స్ రాబోతున్నాయి.

Pics: అందానికి సరికొత్త నిర్వచనం దిశా పటాని
First published: January 21, 2019, 6:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading