Home /News /national /

SMRITI IRANI DAUGHTER RUNNING ILLEGAL BAR IN GOA ALLEGES CONGRESS PVN

Smrithi Irani : గోవాలో స్మృతీ ఇరానీ కుమార్తె "అక్రమ"వ్యవహారంపై దుమారం!

కుమార్తె జోయిష్ తో స్మృతీ ఇరానీ(ఫైల్ ఫొటో)

కుమార్తె జోయిష్ తో స్మృతీ ఇరానీ(ఫైల్ ఫొటో)

Smrithi Irani Daughter Illegal Bar : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ చిక్కుల్లో పడ్డారు. గోవాలో రెస్టారెంట్ నడుపుతున్న స్మృతి ఇరానీ కుటుంబం మోసపూరిత మార్గాల ద్వారా మద్యం లైసెన్స్ పొందిన వ్యవహారం సంచలనం రేపింది.

Smrithi Irani Daughter Illegal Bar : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ చిక్కుల్లో పడ్డారు. గోవాలో రెస్టారెంట్ నడుపుతున్న స్మృతి ఇరానీ కుటుంబం మోసపూరిత మార్గాల ద్వారా మద్యం లైసెన్స్ పొందిన వ్యవహారం సంచలనం రేపింది. ఉత్తర గోవాలోని అస్సగావ్‌లో స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ ఇరానీ "సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్" అనే రెస్టారెంట్ నిర్వహిస్తోంది. అయితే చనిపోయిన వ్యక్తి పేరును ఉపయోగించి రెస్టారెంట్‌లో మద్యం లైసెన్స్‌ను దాని యజమానులు పునరుద్ధరించినట్లు వెలుగుచూడటంతో ఈ లైసెన్సు వ్యవహారం వివాదంలో పడింది. రెస్టారెంట్ యజమానులు ఎక్సైజ్ కమిషన్‌కు నకిలీ డాక్యుమెంట్లున అందించి అక్రమంగా, మోసపూరితంగా లైసెన్స్ పొందారని రోడ్రిగ్స్‌ అనే న్యాయవాది ఆరోపించారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా రోడ్రిగ్స్‌ ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను పొందగలిగారు. కేంద్రమంత్రి కుటుంబ సభ్యులు పాల్పడిన ఈ మోసంపై లోతుగా దర్యాప్తు జరపాలని, ఇందులో ఎక్సైజ్‌ అధికారులు, అస్సగావ్‌ గ్రామపెద్దలు మిలాఖతయ్యారని రోడ్రిగ్స్ ఆరోపించారు.

దీంతో గోవా ఎక్సైజ్ శాఖ కమిషనర్ నారాయణ్ ఎం గాడ్ రెస్టారెంట్‌ కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తప్పుడు పద్ధతుల్లో, నకిలీ పత్రాల ద్వారా ఆమె మద్యం లైసెన్స్‌ పొందారని న్యాయవాది ఏరిస్‌ రోడ్రిగ్స్‌ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ నోటీసు ఇచ్చారు. జులై 29వతేదీన ఈ అంశంపై కోర్టులో విచారణ జరగనుంది. షోకాజ్ నోటీసు ప్రకారం లైసెన్స్ హోల్డర్ గత ఏడాది మే 17న మరణించినప్పటికీ, రెస్టారెంట్ మద్యం లైసెన్స్ గత నెలలో పునరుద్ధరించారు.ఈ ఏడాది జూన్ 22వ తేదీన ఆంథోనీ‌ద్గామా పేరుతో రెస్టారెంట్ లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆంథోని దిగామా మే 2021లో మరణించారని షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. నిజానికి గోవాలో బార్‌ లైసెన్స్‌ ఇవ్వాలంటే ముందుగా రెస్టారెంట్‌ ఉండాలి. ఇప్పటికే ఉన్న రెస్టారెంట్‌ కు మాత్రమే మద్యం లేదా బార్ లైసెన్స్ పొందవచ్చనని రోడ్రిగ్స్ అన్నారు. కానీ సిల్లీ సోల్స్ కేఫ్ అండ్ బార్ విషయంలో మాత్రం ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ విదేశీ మద్యం, దేశీయ మద్యం కోసం గత ఏడాది ఫిబ్రవరిలో యజమానులకు లైసెన్స్ ఇవ్వడానికి నిబంధనలను మార్చారని లాయర్ రోడ్రిగ్స్ ఆరోపించారు.

Partha Chatterjee Arrest : టీఎంసీకి బిగ్ షాక్..బెంగాల్ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ



మొత్తం ఎక్సైజ్‌ దరఖాస్తులన్నీ ముంబై విల్లెపార్లేకు చెందినట్టుగా చెప్తున్న దిగామా పేరుమీదనే సమర్పించారని, సదరు వ్యక్తి ఆధార్‌ కార్డు 2020 డిసెంబర్‌లోనే జారీ అయ్యిందని న్యాయవాది రోడ్రిగ్స్‌ జరిపిన పరిశోధనలో తేలింది. చిన్నపాటి సమాచారం ఆధారంగా ఆయన నెలల తరబడి ఈ కేసుపై కూపీ లాగారు. ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ జారీ చేసిన దిగామా డెత్‌ సర్టిఫికెట్‌ కూడా సంపాదించారు. 1200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టిన సిల్లీ సోల్స్‌ వంటి టాప్‌ రెస్టారెంట్‌కు, ఈ చనిపోయిన వ్యక్తికి ఏం సంబంధమో తెలుసుకోవాలని ఆయన అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. చట్టవిరుద్ధంగా రెస్టారెంట్‌ను నడుపుతున్నారని, వెంటనే స్మృతి ఇరానీని తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ కుమార్తె జోయిష్ కొట్టిపడేశారు. అవన్ని నిరాధారమైన ఆరోపణలన్నారు. మంత్రి స్మృతి ఇరానీ పరువు తీయాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రత్యర్థులు ఆమెపై ఇలాంటి ఆరోపణలు చేశారని ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది కిరత్ నాగ్రా తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Goa, Smriti Irani

తదుపరి వార్తలు