అనుచరుడి అంతిమయాత్రలో పాడె మోసిన స్మృతి ఇరానీ...కన్నీటి వీడ్కోలు...

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథిలో స్మృతి ఇరానీకి అత్యంత ఆప్తుడైన సురేంద్ర సింగ్‌ను కొందరు దుండగులు నాటు తుపాకులతో కాల్చిచంపారు. బరౌలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ బీజేపీ పార్టీలో చురుగ్గా పనిచేసేవాడు. అలాగే స్మృతీ ఇరానీకి సైతం అత్యంత సన్నిహితుడు.

news18-telugu
Updated: May 26, 2019, 6:48 PM IST
అనుచరుడి అంతిమయాత్రలో పాడె మోసిన స్మృతి ఇరానీ...కన్నీటి వీడ్కోలు...
పాడె మోస్తున్న స్మృతి ఇరానీ (Image : Smriti Z Irani / instagram)
  • Share this:
బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ తన సహచరుడి అంతిమయాత్రలో భౌతికకాయం ఉన్న పాడెను మోసి అందరినీ ఆకర్షించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథిలో స్మృతి ఇరానీకి అత్యంత ఆప్తుడైన సురేంద్ర సింగ్‌ను కొందరు దుండగులు నాటు తుపాకులతో కాల్చిచంపారు. బరౌలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ బీజేపీ పార్టీలో చురుగ్గా పనిచేసేవాడు. అలాగే స్మృతీ ఇరానీకి సైతం అత్యంత సన్నిహితుడు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా స్మృతి ఇరానీతో కలిసి సురేంద్ర నియోజకవర్గంలో చురుగ్గా పనిచేశారు. అలాగే అమేథి లోక్‌సభ నియోజకవర్గం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై స్మృతి ఇరానీ సంచలన విజయం సాధించిన తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం కావడం విషాదం. ఇదిలా ఉంటే సురేంద్ర సింగ్ శనివారం రాత్రి ఇంటి ఆవరణలో ఆరుబయట నిద్రిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై నాటు తుపాకులతో కాల్పులు జరిపారు.

దీంతో తీవ్ర గాయాలపాలైన సురేంద్రను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేందర్ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీ ఎత్తున్న బలగాలను మోహరించారు. అయితే ఈ హత్య వెనుక రాజకీయ విభేదాలు ఉన్నాయా ? లేక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

First published: May 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు