నేటి యువత ట్రెండ్‌ను ఫాలో అవ్వడం మానేసి కొత్త ట్రెండ్ సృష్టించాలని టార్గెట్‌గా పెట్టుకుంటోంది. వినూత్న ఆలోచనలు, ఉత్పత్తులు, మార్గాలతో విజయం సాధించినవారు ఎందరో ఉన్నారు. ఆహార పదార్థాల్లోనూ ఈ ట్రెండ్ కనిపిస్తోంది. ఇటీవల కాలంలో నోట్లో పెట్టుకుంటే పొగ వచ్చే స్మోకీ ఫుడ్ ట్రెండీగా మారింది. ముఖ్యంగా యువతీయువకులు పొగలు వచ్చే ఆహారపదార్థాలను నోట్లో ఉంచుకుని ఫొటోలు తీసుకుంటూ సరదా పడుతున్నారు.
ఇదే ఫార్ములాతో వెస్ట్‌బెంగాల్‌లోని అలీపుర్దువార్ ప్రాంతంలో అరిజిత్ బానిక్ అనే యువకుడు తన బిజినెస్‌ను విస్తరించుకుంటున్నాడు. ఒక ఫుడ్ ఫెయిర్‌లో స్టాల్ పెట్టుకుని స్మోక్ వచ్చే ఫుడ్‌ను అతడు సర్వ్ చేశాడు. అంతే, ఇక యువతీ యువకులు పోటీ పడ్డారు. పొగలు వెలువడే ఫుడ్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా ట్రై చేసేందుకు ఎగబడ్డారు. అయితే ఈ పొగ ఎలా వస్తుందో తెలుసా.. లిక్విడ్ నైట్రోజన్ కారణంగా.
* ఇంతకీ ఆ ఫుడ్ ఏంటి?
అరిజిత్ సర్వ్ చేసే స్మోక్ వచ్చే ఫుడ్.. వేఫర్స్. వాటిపై లిక్విడ్ నైట్రోజన్ చుక్కలు వేసి పొగలు వచ్చేలా చేస్తారు. ఈ వేఫర్స్ కోసం అక్కడ ఆర్డర్ ప్రక్రియ ఉంటుంది. ముందుగా డబ్బులు చెల్లించి టోకెన్ తీసుకోవాలి. తర్వాత టోకెన్ వేఫర్స్ తయారుచేసే వారికి ఇస్తే.. మనకు కావాల్సిన ఫ్లేవర్స్‌తో వాటిని అందిస్తారు. ఒక కప్పులో ఆరు లేదా ఏడు వేఫర్స్ ఇస్తారు. దానిపై కంటెయినర్‌లో ఉంచిన లిక్విడ్ నైట్రోజన్‌ను కొన్ని చుక్కలు వేస్తారు. దీంతో ఆ వేఫర్స్‌ను నోట్లో పెట్టుకుని గట్టిగా కొరికితే పొగలు వస్తాయి. అది చూడడానికి వెరైటీగా ఉండడంతో అంతా ఫొటోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.
తన ఫుడ్‌కి తగినట్లుగానే తన స్టాల్‌కు స్మోక్ బైట్ అని పేరు పెట్టాడు అరిజిత్. దీంట్లో వెస్ట్రన్ మ్యూజిక్‌తో అందరి దృష్టి స్టాల్‌పైన పడేలా చేశారు. ఇంకేముందు జనాలు పోటెత్తడమే కాకుండా, అందరి ప్రశంసలు అందుకున్నారు. చీకట్లో వెలుగులు విరజిమ్మే లైట్లతో, చక్కని వెస్ట్రన్ మ్యూజిక్‌తో పాటు ట్రెండీగా స్మోక్ వచ్చేలాగా ఫుడ్ సర్వ్ చేస్తే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇలా తన స్పెషల్ ఫుడ్‌కు ఫ్యాన్స్ ఏర్పడ్డారు.
* సక్సెస్‌పై ఆనందం
అందరికీ కొత్తదనం నచ్చుతుందని, కొత్త వస్తువులు, కొత్త ఆహార పదార్థాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయని.. అందుకే తాను ఇలాంటి ఆహారపదార్థాన్ని ఎంచుకున్నానని స్టాల్ యజమాని అరిజిత్ తెలిపారు. ఈ ఫుడ్‌ను ఫెయిర్‌లో పెట్టేందుకు చాలా రీసెర్చ్ చేశానని చెప్పారు. అయితే అది అందరికీ నచ్చితేనే విజయం సాధించినట్లని పేర్కొన్నారు. అయితే తన ఫుడ్ అందరికీ నచ్చుతోందని, అందరూ మెచ్చుకుంటున్నారని ఆయన సంతోషం వ్యక్తంచేశారు.
ఈ మధ్యకాలంలో ఇలాంటి ఆహారపదార్థాలు వివిధ రకాలుగా మార్కెట్లో వస్తున్నాయి. స్మోక్ బాల్స్, బిస్కట్స్‌పై లిక్విడ్ నైట్రోజన్ వేసి స్మోక్ బిస్కట్స్, స్మోక్ ఛీజ్ బాల్స్, స్మోక్ వేఫర్స్, స్మోక్ పాన్ ఇలా రకరకాలుగా అమ్ముతున్నారు. అయితే ఈ లిక్విడ్ నైట్రోజన్ సరైన విధంగా వాడకపోతే ప్రమాదకరం. ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food, National News, West Bengal