'ఈ కోడిపిల్లను బతికించండి ప్లీజ్'...తల్లడిల్లిన పసివాడి హృదయం

కోడిపిల్లతో డెరెక్

నర్సు తీసిన ఆ ఫొటోను సాంగా సేస్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. పసివాడి మానవత్వానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు లక్ష లైకులు, 90 వేల షేర్లు వచ్చాయి. దాదాపు పది వేల మందికి పైగా నెటిజన్లు నిష్కల్మషమైన పసివాడి మనసును ప్రశంసిస్తున్నారు.

 • Share this:
  'పిల్లలూ, దేవుడూ చల్లనివారే..కల్లకపటమని మెరుగని కరుణామయులే..' లేతమనసు సినిమాలోని ఈ పాట కల్మషం లేని చిన్నపిల్లల మనసు, వారిలోని అమాయకత్వాన్ని వర్ణిస్తుంది. చిన్నపిల్లలు, దేవుళ్లు ఒకటేనన్న తాత్పర్యాన్ని తెలుపుతుంది. ఇది అక్షరాలా నిజం. పసిపిల్లల మనసులు స్వచ్ఛమైనవి. వారు చెప్పే ముద్దు ముద్దు మాటలు..చేసే అల్లరి పనులు ఎంతో ముచ్చటగా ఉంటాయి. మిజోరంలో జరిగిన ఓ ఘటనే దీనికి నిదర్శనం..! ఆరేళ్ల పిల్లాడు చేసిన ఓ పనికి లక్షలాది మంది నెటిజెన్లు ఫిదా అయ్యారు. వాటి అమాయకత్వంలో ఉన్న మానవత్వానికి సెల్యూట్ చేస్తున్నారు.

  మిజోరంలోని సైరంగ్ ప్రాంతంలో ధీరజ్ ఛెత్రి ఫ్యామిలీ నివసిస్తోంది. అతడికి డెరెక్ సి లాల్చాన్‌హిమా అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల ఇంటి సమీపంలోని రోడ్డుపై ఆడుకుంటుండంగా డెరెక్ సైకిల్ కిందపడి ఓ కోడిపిల్ల చనిపోయింది. అది చనిపోయిందన్న విషయం తెలియని ఆ బాలుడు ఇంట్లోకి పరగెత్తుకెళ్లి కోడిపిల్లను కాపాడాలని తల్లిదండ్రులను కోరాడు. 'ప్లీజ్ మమ్మీ..ప్లీజ్ డాడీ..ఈ చిక్‌ని రక్షించడి.'' అని ఏడుస్తూ అడిగాడు. ఐతే అది బతకదని తెలిసిన తల్లిదండ్రులు.. ''నువ్వే ఆస్పత్రికి తీసుకెళ్లు''. అని సరదాగా చెప్పారు.

  ఐతే ఆ బాలుడు నిజంగానే కోడిపిల్లను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఓ చేతిలో పది రూపాయల నోటును, మరో చేతిలో కోడిపిల్లను పట్టుకొని డాక్టర్‌ దగ్గరకు వెళ్లాడు. ''అంకుల్...ఈ పది రూపాయలు తీసుకొని కోడిపిల్లను రక్షించండి .'' అక్కడే ఉన్న ఓ నర్సు డెరెక్ అమాయకత్వాన్ని చూసి ముచ్చటపడింది. ఆ పిల్లాడిని, కోడిపిల్లను ఫొటోతీసి ఇంటికి పంపించారు. ఐతే ఏడుస్తూ ఇంటికి చేరిన డెరెక్..డాక్టర్లపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. వైద్యులు ఎలాంటి చికిత్స చేయలేదని చెప్పారు. ఎక్కువ డబ్బులు చికిత్స చేస్తారేమో.. వంద రూపాయలు ఇవ్వండని అడిగాడు. ఐతే తల్లిదండ్రులు చివరకు నిజం చెప్పారు. కోడిపిల్ల చనిపోయిందని.. మళ్లీ బతకదని వివరించడంతో కన్నీళ్లుపెట్టుకున్నాడు డెరెక్.

  నర్సు తీసిన ఆ ఫొటోను సాంగా సేస్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. పసివాడి మానవత్వానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు లక్ష లైకులు, 90 వేల షేర్లు వచ్చాయి. దాదాపు పది వేల మందికి పైగా నెటిజన్లు నిష్కల్మషమైన పసివాడి మనసును ప్రశంసిస్తున్నారు. అతడిలోని నిజాయితీ, వినయము, జవాబుదారీతనం,మానవత్వానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.
  First published: