హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

100 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ మరో చిన్నారి..మృత్యువుతో పోరాటం!

100 అడుగుల లోతు బోరుబావిలో పడ్డ మరో చిన్నారి..మృత్యువుతో పోరాటం!


బోరుబావిలో పడ్డ  రితిక్

బోరుబావిలో పడ్డ రితిక్

Boy falls into borewell : పూడ్చకుండా వదిలేసిన బోరుబావులు చిన్నారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. ఇదివరకు ఎన్ని ఘటనలు జరిగినా, ప్రభుత్వాలు, పోలీసులు ఎంత హెచ్చరించినా ప్రజల్లో మాత్రం మార్పురావడం లేదు. నీటి కోసం బోర్లు వేయడం...వాటిలో నీరు రాకపోవడంతో అలాగే పూడ్చకుండా వదిలేయడం పరిపాటిగా మారింది.

ఇంకా చదవండి ...

Boy falls into borewell : పూడ్చకుండా వదిలేసిన బోరుబావులు చిన్నారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. ఇదివరకు ఎన్ని ఘటనలు జరిగినా, ప్రభుత్వాలు, పోలీసులు ఎంత హెచ్చరించినా ప్రజల్లో మాత్రం మార్పురావడం లేదు. నీటి కోసం బోర్లు వేయడం...వాటిలో నీరు రాకపోవడంతో అలాగే పూడ్చకుండా వదిలేయడం పరిపాటిగా మారింది. ఇలా పూడ్చకుండా వదిలేసిన 100 అడుగుల లోతు బోరుబావిలో తాజాగా ఓ చిన్నారి ప్రమాదవశాత్తు పడిన సంఘటన పంజాబ్​ లో చోటుచేసుకుంది. అయితే చిన్నారి ఇంకా ప్రాణాలతోనే ఉండటంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్​పుర్​ జిల్లాలోని కైలా బులంద గ్రామంలో సరదాగా ఆడుకుంటున్న రితిక్ రోషన్( అనే ఆరేళ్ల వయస్సు ఉన్న బాలుడిని వీధికుక్కలు వెంటపడ్డాయి. వీధి కుక్కలు వెంటపడగా బాలుడు పరిగెత్తాడు. దీంతో చూసుకోకుండా గోనె సంచులతో కప్పి ఉన్న బోరుబావి​లో పడిపోయాడు. బాలుడు వలస కూలీల కుటుంబానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్​డీఆర్​ఎఫ్​) అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. డిప్యూటీ కమీషనర్ సందీప్ హన్స్‌తో సహా జిల్లా యంత్రాంగం యొక్క బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. వైద్య బృందాలను కూడా రంగంలోకి దించారు. బాలుడి పరిస్థితిని పర్యవేక్షించేందుకు బోర్‌వెల్‌లో కెమెరాను కూడా ఉంచామని, పైపుల ద్వారా హై ఫ్లో ఆక్సిజన్‌ను అందిస్తున్నామని అధికారులు తెలిపారు.

ALSO READ  Honey Trap : వలపు వలలో జవాన్..ఐఎస్ఐ మహిళా ఏజెంట్ కు రహస్య సమాచారం

ఇక,ఈ ఘటనపై పంజాబ్ సీఎం స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. "హోషియార్‌పూర్‌లో ఆరేళ్ల బాలుడు రితిక్ బోరుబావిలో పడిపోయాడు. జిల్లా యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా యంత్రాంగంతో తాను నిరంతరం టచ్‌లో ఉన్నాను" అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు.

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ మాట్లాడుతూ.. బాలుడిని సురక్షితంగా తరలించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ లో.."“హోషియార్‌పూర్‌లో బోర్‌వెల్‌లో పడిపోయిన 6 ఏళ్ల రితిక్‌ని త్వరగా మరియు సురక్షితంగా తరలించాలని ప్రార్థిస్తున్నాను. అధికార యంత్రాంగం తమ వంతు కృషి చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని పేర్కొన్నారు.

First published:

Tags: Borewell, Children, Punjab

ఉత్తమ కథలు