Home /News /national /

SIX PEOPLE WERE ALSO INJURED IN THE BOILER EXPLOSION AT A FACTORY IN BIHARS MUZAFFARPUR SK

Bihar Explosion: నూడుల్స్ ఫ్యాక్టరీలో ఘోరం.. బాయిలర్ పేలి ఆరుగురు కార్మికులు దుర్మరణం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Bihar explosion: బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీలోని గోడలు బద్ధలయ్యాయి. ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయింది. కార్మికుల మృతదేహాలు ముక్కలు ముక్కలయ్యాయి. గుర్తుపట్టరాని విధంగా మారిపోయాయి.

    బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రముఖ నూడుల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ముజఫర్‌పూర్‌ జిల్లా భేలాలో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భారీ శబ్ధంతో పేలుడు జరిగిందని, కాసేపటి తర్వాత బాయిలర్ నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు శబ్ధం 5 కిలో మీటర్ల  దూరం వరకు వినిపించిందంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పేలుడు ధాటికి చుట్టుపక్కల  ఉన్న పలు పరిశ్రమలు కూడ దెబ్బతిన్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడ్డ కార్మికులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



    Train Accident: ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా రెండు రైళ్లు.. చూస్తుండగానే  ఘోర ప్రమాదం

    బాయిలర్ పేలడంతో ఫ్యాక్టరీలోని గోడలు బద్ధలయ్యాయి. ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయింది. కార్మికుల మృతదేహాలు ముక్కలు ముక్కలయ్యాయి. గుర్తుపట్టరాని విధంగా మారిపోయాయి. పక్కన ఉన్న భవనాల గోడలు కూడా కూలిపోయాయి. ఐతే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ పవన కుమార్ తెలిపారు.

    అమ్మపై ప్రేమనా? లేదంటే పిచ్చా? తల్లి సమాధి తవ్వి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కొడుకు

    ఐదు అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. మూడు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే ఘోరం జరిగింది. పేలుడు ధాటికి కార్మికులు స్పాట్‌లోనే మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మరో 20-25 మంది పని చేస్తున్నారు. వీరిలో ఇప్పటికే ఆరుగురు మరణించగా.. మరికొందరికి తీవ్ర గాయాలలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థతి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bihar, Explosion

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు