హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gas Leak: ఘోర ప్రమాదం.. ట్యాంకర్ నుంచి విష వాయువులు లీక్.. ఆరుగురు కార్మికులు మృతి

Gas Leak: ఘోర ప్రమాదం.. ట్యాంకర్ నుంచి విష వాయువులు లీక్.. ఆరుగురు కార్మికులు మృతి

గ్యాస్ లీకై ఆరుగురు మృతి

గ్యాస్ లీకై ఆరుగురు మృతి

Surat Gas Leak: ఘటనా సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఇప్పటికే ఆరుగురు మరణించగా.. మరో 22 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఎనిమింది మంది వెంటిలేటర్‌పై ఉన్నారు.

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఆరుగురు కార్మికులు (Gujarat Gas Leak) మరణించారు. మరో 20 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. గురువారం ఉదయం సూరత్‌లోని సచిన్ GIDC ప్రాంతంలోని ఈ ఘటన (Surat Gas Leak) చోటు చేసుకుంది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఇవాళ తెల్లవారుఝామున ఓ పేపర్ మిల్లుకు సంబంధించిన పారిశ్రామిక వ్యర్థాలను ట్యాంకర్‌లో తీసుకెళ్లి.. సమీపంలో ఉన్న చెరువులో వదిలే ప్రయత్నం చేశారు. ఐతే ట్యాంకర్ నుంచి పెద్ద ఎత్తున విష వాయువులు లీక్ అయ్యాయి. ఐతే ఆ సమయంలో కొందరు కార్మికులు ఫ్యాక్టరీలో నైట్ షిప్ట్‌లో పనిచేస్తుండగా.. మరికొందరు నిద్రలో ఉన్నారు. చెరువు మీదుగా వీచే గాలి.. కంపెనీ వైపు వెళ్తుంది. అలా గాలితో పాటు ఆ విష వాయువులు కంపెనీలోకి వెళ్లాయి. గ్యాస్‌ను పీల్చిన తర్వాత కార్మికులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. పలువురు అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. మరికొందరు స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న సూరత్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి..సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని ట్యాంకర్ వాల్వ్‌ని కట్టేశారు. లేదంటే మరింతగా విష వాయువులు లీకయ్యేవని స్థానికులు వాపోయారు.

India Corona Bulletin: లాక్‌డౌన్స్ తప్పవా..? లక్షకు చేరువలో రోజువారీ కరోనా కేసులు

Agriculture Loans: రైతులకు కోసం కేంద్రం మరో కీలక నిర్ణయం.. వ్యవసాయ రుణాలపై టార్గెట్ పెంపు

ఘటనా సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఇప్పటికే ఆరుగురు మరణించగా.. మరో 22 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరిలో ఎనిమింది మంది వెంటిలేటర్‌పై ఉన్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థాలను సమీపంలో ఉండే చెరువుల్లోకి వదలడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అందరూ నిద్రపోయిన పలు కంపెనీలకు చెందిన ట్యాంకర్లు పారిశ్రామిక వ్యర్థాలను కాలువు, చెరువుల్లో వదులుతున్నాయని, వాటి వల్ల తాము అస్వస్థతకు గురవుతున్నామని సమీప గ్రామాల ప్రజలు కొన్ని రోజులుగా వాపోతున్నారు. ఐనప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకై ఆరుగురు మరణిచడం సూరత్‌లో తీవ్ర కలకలం రేపింది.

First published:

Tags: Gas leak, Gujarat

ఉత్తమ కథలు