హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Encounter: చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ .. ఆరుగురు మావోయిస్టుల్ని మట్టుబెట్టిన బలగాలు

Encounter: చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ .. ఆరుగురు మావోయిస్టుల్ని మట్టుబెట్టిన బలగాలు

encounter

encounter

Encounter: ఛత్తీస్‌గడ్‌లో బలగాలు, మావోయిస్టుల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈఘటనలో ఆరుగురు మావోయిస్టులను బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్ పొమర్రా- హల్లూరు ఫారెస్ట్ ఏరియాలో జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Chhattisgarh, India

మళ్లీ యాక్టివ్ అవుతున్న మావోయిస్టు దళాలకు పోలీసు బలగాలు కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఛత్తీస్‌గడ్‌(Chhattisgarh)రాష్ట్రంలో బలగాలు, మావోయిస్టుల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈఘటనలో ఆరుగురు మావోయిస్టులను బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్(Encounter)శనివారం పొమర్రా- హల్లూరు (Pomarra- Hallur)ఫారెస్ట్ ఏరియాలో జరిగింది. అటవీ ప్రాంతంలో 50మందికిపైగా మావోయిస్టులు సమావేశమయ్యారనే కీలక సమాచారం అందుకున్న బలగాలు ఎటాక్ చేశాయి. చనిపోయిన ఆరుగురు మావోయిస్టు(Six Maoists killed)ల్లో ఇద్దరు మహిళ సభ్యులు ఉండటం విశేషం.

Mirchi Pakora: క్యాటెస్ట్.. చలికాలంలో పండిట్ జీ మిర్చి పకోడాకు భలే గిరాకీ.. ఎక్కడంటే..

విరుచుకుపడ్డ బలగాలు..

చత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు మళ్లీ తమ కార్యకలాపాలను విస్తరించాలని పథకం వేసుకున్నట్లుగా పోలీసు బలగాలు పసిగట్టాయి. ఈనేపధ్యంలోనే వారికి చెక్ పెట్టేందుకు కూంబింగ్‌ నిర్వహించాయి. శనివారం బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. జిల్లాలోని మిర్తూర్‌ పోలీస్ స్టేషన్ సమీపంలోని పోమ్రా-హల్లూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అవుతున్నట్లుగా తెలుసుకున్న బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. బీజాపూర్‌ డివిజన్ కమిటీ సభ్యులతో పాటు మరో 40మంది వరకు మావోయిస్టులు ఆయా ప్రాంతానికి చేరుకున్నాయని తెలిసి సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, జిల్లా రిజర్వు బలగాలు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు అడవిలో గాలింపు ముమ్మరం చేశారు.

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు మృతి..

ఈక్రమంలోనే మావోయిస్టులు, బలగాలు ఎదురెదురు పడటంతో కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు మహిళా సభ్యులు ఉన్నారు. చనిపోయిన ఆరుగురిలో నాలుగురి మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకోగా..ఇద్దరి మృతదేహాల్ని మావోయిస్టులు తీసుకెళ్లారని పోలీసు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందు పాతరకు సంబంధించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Shocking: చెత్తను వీధుల్లో వేసే వారికి షాక్.. ఉదయం 8 తర్వాత చెత్త వేస్తే రూ. లక్ష ఫైన్.. ఎక్కడంటే..

అడవిలో అలజడి..

సుమారు 40మందికిపైగా మావోయిస్టులు సమావేశమైనట్లుగా పక్కా సమాచారంతో ఎటాక్ చేసిన బలగాలు దళంపై చాపు దెబ్బ కొట్టారు. ఆరుగురు మృతి చెందగా ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌ జరిగిన చోట 303,315 రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మందుపాతరకు సంబంధించిన పేలుడు పదార్ధాలను రికవరీ చేసుకున్నారు. డిసెంబర్ 2వ తేది నుంచి 8వరకు జరిగే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల నిర్వాహణపై మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

First published:

Tags: Chhattisgarh, Encounter

ఉత్తమ కథలు