ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అడవుల్లో మళ్లీ కాల్పుల మోత మోగింది. పచ్చటి అడవులు ఎర్రబారాయి. బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు (Maoists) మరణించారు. బస్తర్ ప్రాంతంలోని పోమ్రా-హల్లూరు అటవీ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. పోమ్రా-హల్లూరు ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ బీజాపూర్ డివిజనల్ కమిటీ సభ్యులు మోహన్ కడ్తి, సుమిత్రతో పాటు సుమారు 40 మంది మావోలు సమావేశమైనట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం వారోత్సవాలకు సంబంధించి వారు సమావేశమైనట్లు తెలిసింది. రంగంలోకి దిగిన సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF, జిల్లా రిజర్వు బలగాలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అడవిలో శుక్రవారం రాత్రి నుంచే సంయుక్తంగా కూంబింగ్ ప్రారంభించాయి.
శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. భద్రతా బలగాలను చూడగానే మావోయిస్టులు మొదట కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. దాదాపు గంటకు పైగా ఎదురుకాల్పులు కొనసాగాయి. ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు భద్రత దళాలు వెల్లడించారు.
OMG: ఉపన్యాసం విని జుట్టు పెంచుకున్న వ్యక్తి.. 23 ఏళ్లలో ఎంత ఖర్చుచేశాడంటే.
ఆ తరువాత ఘటనా స్థలంలో నాలుగు మృతదేహాలు కనిపించాయని పోలీసులు వివరించారు. ఎదురు కాల్పుల్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆరుగురిలో ఇద్దరి మృతదేహాలను మావోయిస్టులు తమ భుజాలపై మోసుకెళ్లారు. మిగతా నలుగురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు మోహన్ కడ్తి (40), మట్వారా ఎల్వోఎస్ సభ్యుడు రమేష్ (32), సుమిత్ర (28)తో పాటు మరో మహిళా మావోయిస్టు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పుల్లో మరికొందరు మావోయిస్టులు గాయపడినట్లు పేర్కొన్నారు.
ఘటనా స్థలం నుంచి 303, 315 రైఫిళ్లతోపాటు మూడు ఆయుధాలు, మందుపాతర సామగ్రి, విప్లప సాహిత్య పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబరు 2వ తేదీ నుంచి 8 వరకు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగానే మావోయిలు అక్కడ సమావేశమైనట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆపరేషన్ ఇంకా పూర్తవలేదని గాలింపు కొనసాగిస్తున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chhattisgarh, Encounter, Maoists