Jammu Kashmir Encounter: చనిపోయిన ఉగ్రవాదులంతా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినట్లుగా భద్రతా దళాలు గుర్తించాయి. ఈ రెండు చోట్ల కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
జమ్మూకాశ్మీర్ (Jammu and Kashmir)లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. ఇటీవల ఉగ్రకార్యకలాపాలు ఎక్కువవడంతో ఇండియన్ ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఉగ్రవాదలు భరతం పడుతున్నారు. తాజాగా గురువారం తెల్లవారుఝామున దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో భీకర కాల్పులు (Jammu Kashmir Encounter) జరిగాయి.ఈ కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గురువారం ఉదయం కుల్గాం (Kulgam Encounter), అనంత్ నాగ్ జిల్లాల్లో (Anantnag encounter) ఎన్కౌంటర్ జరిగిందని జమ్మూకాశ్మీర పోలీసులు తెలిపారు. కుల్గాం జిల్లా మిర్హామా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా దళాలు రంగంలోకి దిగి కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి. ఆ సమయంలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కిఉన్నారు. భద్రతా దళాలను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాంతో జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు మరణించారు.
అటు అనంత్‌నాగ్ జిల్లాలోని దూరు సమీపంలో ఉన్న నౌగామ్ సాహబాద్ ప్రాంతంలోనూ కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలను చూసి టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. జవాన్లు వెంటనే అప్రమత్తమై ఎదురు దాడికి దిగారు. ఈ ఘటనలో మరో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఓ పోలీస్ అధికారికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం ఆరుగురు టెర్రరిస్టులు మరణించారని పోలీసులు అధికారికంగా ప్రకటించాయి. మృతుల్లో ఇద్దరు పాకిస్తానీలు, ఇద్దరు కాశ్మీర్ ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిపారు. మరో ఇద్దరు మృతులను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.
#UPDATE | 6 terrorists of proscribed outfit JeM killed in two separate encounters (Anantnag & Kulgam). 4 among the killed terrorists have been identified so far as 2 Pakistani & 2 local terrorists. Identification of the other 2 terrorists is being ascertained: IGP Kashmir
చనిపోయిన ఉగ్రవాదులంతా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినట్లుగా భద్రతా దళాలు గుర్తించాయి. ఈ రెండు చోట్ల కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి చుట్టుపక్కల మరికొందరు టెర్రరిస్టులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అడవులను జల్లెడ పడుతున్నాయి. మరోవైపు ఎన్కౌంటర్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా శ్రీనగర్ సహా పలు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.