ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు.. ఆరుగురు ఐటీబీపీ జవాన్ల మృతి

రాజధాని రాయ్‌పూర్‌కి 350కి.మీ దూరంలోని నారాయణపూర్‌ ఐటీబీపీ క్యాంపులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు నారాయణపూర్ ఎస్పీ తెలిపారు.

news18-telugu
Updated: December 4, 2019, 12:01 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో కాల్పులు.. ఆరుగురు ఐటీబీపీ జవాన్ల మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఛత్తీస్‌గఢ్‌లోని కదెనార్ క్యాంపులో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP) మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. అంతర్గత ఘర్షణ కాల్పులకు దారితీసినట్టు సమాచారం. ఓ జవాన్ తన గన్‌తో కాల్పులకు పాల్పడటంతో మొత్తం ఆరుగురు ఐటీబీపీ జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని రాయ్‌పూర్‌కి 350కి.మీ దూరంలోని నారాయణపూర్‌ ఐటీబీపీ క్యాంపులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు నారాయణపూర్ ఎస్పీ తెలిపారు.
Published by: Srinivas Mittapalli
First published: December 4, 2019, 12:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading