క్వారంటైన్ కేంద్రంలో ఆరు అడుగుల పొడవైన పాము..

ప్రతీకాత్మక చిత్రం

క్వారంటైన్ కేంద్రంలోని ఆరు అడుగుల పాము ప్రవేశించింది. అది చూసి క్వారంటైన్ కేంద్రంలోని కరోనా రోగులు భయంతో పరుగులు తీశారు. అనంతరం అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

  • Share this:
    జూలై వచ్చిందంటే చాలు.. వర్షాలు ముసురుపెడుతుంటాయి. దీంతో ఖాళీ ప్రదేశాల్లో గడ్డి, కంపచెట్లు ఎక్కువగా పుట్టుకొస్తుంటాయి. దీనికితోడు వర్షాకాలంలో పాముల సంచారం అధికంగా ఉంటుంది. మాములు పాముల దగ్గరి నుంచి విష సర్పాల వరకు వర్షాకాలంలో ఎక్కువగా కంటపడుతుంటాయి. అయితే ఓ క్వారంటైన్ కేంద్రంలో కరోనా వైరస్ సోకిన రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. అసలే కరోనా వైరస్ సోకి భయాందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ఆ క్వారంటైన్ కేంద్రంలోని ఓ ఆరు అడుగుల పాము ప్రవేశించడంతో అది చూసిన కరోనా రోగులు భయాందోళనతో పరుగులు పెట్టారు. ఈ ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆగ్రాలోని హిందూస్తాన్ కాలేజీని ఇటీవల కరోనా రోగుల కోసం క్వారంటైన్ కేంద్రంగా మార్చారు. అయితే ఆ కేంద్రంలోకి ఆరు అడుగుల పాము ప్రవేశించింది.

    అది చూసి క్వారంటైన్ కేంద్రంలోని కరోనా రోగులు భయంతో పరుగులు తీశారు. అనంతరం అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. అయితే ఈ పాము వర్షాకాలంలో సాధారణంగా కన్పిస్తూ ఉంటుందని, ఇది ఏలాంటి హానీ తలపెట్టదని సిబ్బంది తెలిపారు. ఇది నివాస ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతుంటుందని పేర్కొన్నారు. దీంతో క్వారంటైన్ కేంద్రంలోని రోగులు ఊపిరీ పిల్చుకున్నారు.
    Published by:Narsimha Badhini
    First published: