హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Fire Accident: హృదయ విదారక ఘటన.. పూరి గుడిసె తగలబడి ఆరుగురు చిన్నారుల సజీవ దహనం

Fire Accident: హృదయ విదారక ఘటన.. పూరి గుడిసె తగలబడి ఆరుగురు చిన్నారుల సజీవ దహనం

మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది

మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది

బీహార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బీహార్‌లో అరరియా ప్రాంతంలో పూరి గుడిసెలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. కాసేపట్లోనే ఇల్లంతా మంటలు అలుముకున్నాయి. ఆ ఇంట్లో చిక్కుకున్న ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఈ ఘటన.. పలసి పోలీస్ స్టేషన్ పరిధిలోని కబియా గ్రామంలో చోటుచేసుకుంది. ఇల్లు తగలబడిన విషయం తెలుసుకున్న...

ఇంకా చదవండి ...

    పాట్నా: బీహార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బీహార్‌లో అరరియా ప్రాంతంలో పూరి గుడిసెలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. కాసేపట్లోనే ఇల్లంతా మంటలు అలుముకున్నాయి. ఆ ఇంట్లో చిక్కుకున్న ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఈ ఘటన.. పలసి పోలీస్ స్టేషన్ పరిధిలోని కబియా గ్రామంలో చోటుచేసుకుంది. ఇల్లు తగలబడిన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. ఆ పిల్లల కేకలు విన్న కొందరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు దట్టంగా అలుముకోవడంతో ఆ ప్రయత్నం వృధా ప్రయాసగానే మిగిలిపోయింది. పూరి గుడిసె తగలబడిందన్న సంగతి తెలిసిన వెంటనే వందల సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అయితే.. మంటలు ఎలా రేగాయన్న దానికి ప్రస్తుతానికి కారణం తెలియరాలేదు. ఫైర్ డిపార్ట్‌మెంట్ వాహనం వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. ఆరుగురు అభంశుభం తెలియని చిన్నారులు మంటల్లో చిక్కుకుని చనిపోవడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. ఆ చిన్నారుల తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో అందరూ ఇంట్లో కూర్చుని ఆడుకుంటున్నట్లు తెలిసింది.

    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Bihar, Children, Fire Accident

    ఉత్తమ కథలు