
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ (File)
Rahul Gandhi : రాహుల్ గాంధీ రాజీనామాను తల్లి సోనియాగాంధీ ఆమోదించేందుకు సిద్ధంగా లేకపోయినా... సోదరి ప్రియాంక గాంధీ మాత్రం సమర్థించారు. రాహుల్ నిర్ణయానికి మద్దతుగా నిలిచారు.
Priyanka Gandhi : ఇంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఇంకెవరైనా అయితే ఇలా చెయ్యగలరా? అని ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీని ఉద్దేశించి... ఆయన సోదరి ప్రియాంక గాంధీ. రాహుల్ నిర్ణయాన్ని మెచ్చుకున్న ఆమె... కొద్ది మందికి మాత్రమే అలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యం ఉంటుందని ట్విట్టర్లో అభిప్రాయపడ్డారు. రాహుల్ నిర్ణయంపై ఎంతో గౌరవం ఉందన్నారు. రాహుల్ గాంధీ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తున్న ట్విట్టర్లో నాలుగు పేజీల రాజీనామా లెటర్ పెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు అందులో తెలిపారు. ఇక ఎంత మాత్రం అధ్యక్ష పదవిలో కొనసాగలేనన్న ఆయన... వెంటనే మరో అధ్యక్షుణ్ని ఎంపిక చెయ్యాల్సిందిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను కోరారు. ఎంపిక ప్రక్రియలో తాను జోక్యం చేసుకోనని తెలిపారు. ఈ అంశంపై ఒక రోజు తర్వాత ప్రియాంక స్పందించారు.
మే 25 నుంచీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అనాసక్తి చూపించారు 49 ఏళ్ల రాహుల్. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్లే గెలుచుకోవడంతో ఆయన తీవ్ర నిరాశ చెందారు. కాంగ్రెస్లో మార్పు రావాలన్న రాహుల్... అది తనతోనే మొదలు పెడుతున్న సంకేతాలిచ్చారు.
Published by:Krishna Kumar N
First published:July 04, 2019, 10:28 IST