హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Kerala: తమ్ముడి చికిత్స కోసం అక్క కోట్లు సేకరణ.. కానీ అదే వ్యాధితో ఆమె మరణం.. చదివితే కన్నీళ్లు ఆగవు !

Kerala: తమ్ముడి చికిత్స కోసం అక్క కోట్లు సేకరణ.. కానీ అదే వ్యాధితో ఆమె మరణం.. చదివితే కన్నీళ్లు ఆగవు !

 తమ్ముడి చికిత్స కోసం అక్క కోట్లు సేకరణ.. కానీ అదే వ్యాధితో అక్క మరణం.. చదివితే కన్నీళ్ళు ఆగవు !

తమ్ముడి చికిత్స కోసం అక్క కోట్లు సేకరణ.. కానీ అదే వ్యాధితో అక్క మరణం.. చదివితే కన్నీళ్ళు ఆగవు !

కేరళ (Kerala)కు చెందిన రఫీక్, మరియుమ్మ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా జన్యుపరమైన వ్యాధుల బారిన పడ్డారు. వారి పెద్ద కుమార్తె అఫ్రా సఫా (16) వెన్నెముక కండరాల క్షీణత (Spinal muscular atrophy) బారిన పడింది.

సంపూర్ణ ఆరోగ్యం(Health)తో జన్మిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ పుట్టుకతోనే వ్యాధులు వస్తే బతుకు నరకం అవుతుంది. అయితే కేరళ (Kerala)కు చెందిన రఫీక్, మరియుమ్మ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా జన్యుపరమైన వ్యాధుల బారిన పడ్డారు. వారి పెద్ద కుమార్తె అఫ్రా సఫా (16) వెన్నెముక కండరాల క్షీణత (Spinal muscular atrophy) బారిన పడింది. అదే జన్యుపరమైన వ్యాధితో ఆమె తమ్ముడు మహ్మద్‌ కూడా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఈ జబ్బుకు చికిత్స పొందుతూ తాజాగా అఫ్రా (Afra) కన్నుమూసింది. అఫ్రా బతికున్నప్పుడు తన తమ్ముడికి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.46 కోట్లు విరాళంగా పొందింది. ఆమెకు కూడా ఈ జబ్బు ఉండటంతో సోమవారం ఉదయం మరణించింది.

ఇదీ చదవండి: Indian Villages: టూర్ ప్లాన్ చేస్తున్నారా ? నార్త్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే.. ఎప్పటికీ మీరు మరచిపోలేరు..!కన్నూర్‌లోని మట్టూల్‌కు చెందిన అఫ్రా కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె జబ్బు మరింత తీవ్రతరం కావడంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ జన్యుపరమైన వ్యాధి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కదలిక కోసం ఉపయోగపడే కండరాలను మరింత బలహీన పరుస్తుంది. తన సోదరుడు మహ్మద్‌కు కండరాలు బలహీనపడే అరుదైన వ్యాధి SMA ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అఫ్రా చాలా బాధపడింది. అతనికి రెండేళ్లు వచ్చేలోపు రూ.18 కోట్ల డోస్ మందు జోల్జెన్‌స్మా ఇవ్వాలని డాక్టర్లు చెప్పడంతో ఆమె నిరాశకు గురైంది. తర్వాత తన తమ్ముడిని ఎలాగైనా కాపాడుకోవాలని వీల్‌చైర్‌లో ఉండే ఆర్థిక సహాయం కోరింది.

‘‘వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి వల్ల నా కాళ్లు, వెన్నెముక వంగిపోయాయి. పడుకోవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తోంది. కానీ మా తమ్ముడి పరిస్థితి ఇప్పుడు అలా లేదు. అతడు నేలపైనా పాకుతున్నాడు. ఇప్పుడు ఈ మందు అతడికి అందించగలిగితే మీరందరూ అతన్ని రక్షించిన వారవుతారు. అతను నాలా బాధపడకూడదు," అని ఆమె ఒక వీడియోలో పేర్కొంటూ ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. ఈ వీడియోని చూసి చాలా మంది చలించిపోయారు. కావాల్సిన మందు దిగుమతుల కోసం కుటుంబం ఆశించిన రూ.18 కోట్లకు బదులు రూ.46 కోట్లు అందించారు. క్రౌడ్ ఫండింగ్ కోసం ఏర్పాటు చేసిన కమిటీ రెండు ఖాతాలను ఓపెన్ చేస్తే.. మొత్తంగా 7.7 లక్షల మంది డబ్బు పంపించారు. గతేడాది ఆగస్టు 24న మహ్మద్‌కు మందు ఇచ్చారు. ప్రస్తుతం అతడికి ఫిజియోథెరపీ సెషన్‌లు కొనసాగుతున్నాయి. ఇతర ట్రీట్మెంట్‌కి డబ్బులు పోనూ మిగిలినవి ఇదే వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు అధికారులు అందించారు.

తమ్ముని కోసం ఎన్నో కోట్లు సేకరించిన అఫ్రా ఇప్పుడు లేదనే నిజం తల్లిదండ్రులను ఎంతగానో బాధిస్తోంది. ఈ బాలికకి సింగింగ్, డ్రాయింగ్‌లో చాలా టాలెంటు ఉంది. కానీ జబ్బు వల్ల తన కలలు, ఆశయాలను వదులుకుంది. బతికి ఉన్నప్పుడు అఫ్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో తన జీవితం, ప్రయాణాలు, అధ్యయనాల గురించి, తన సోదరుడి చికిత్సకు సంబంధించిన అప్‌డేట్‌లను వీడియో రూపంలో అప్‌లోడ్ చేసేది. అఫ్రా ఒక మంచి డాక్టర్ అయి తీవ్ర రోగాలతో బాధపడే వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరుకుంది. ఒక ఇంగ్లీషు మీడియం పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న అఫ్రా మరణం స్థానికులను కూడా కలిచివేసింది. ఈ బాలికకి మట్టూల్ సెంట్రల్ జుమా మసీదు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Published by:Mahesh
First published:

Tags: Health issues, Hospitals, Kerala, Treatment

ఉత్తమ కథలు