మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..ఇక కాలేజీల్లో ప్రతిరోజూ జనగణమన

మహారాష్ట్రలోని అన్ని కాలేజీల్లో ఇక ప్రతి రోజూ జాతీయ గీతం ఆలాపనను తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శివాజీ జయంతి సందర్భంగా ఈ నెల 19 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి రానున్నాయి.

news18-telugu
Updated: February 12, 2020, 6:11 PM IST
మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..ఇక కాలేజీల్లో ప్రతిరోజూ జనగణమన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మహారాష్ట్రలోని అన్ని కాలేజీల్లో జాతీయ గీతం ఆలాపనను తప్పని చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదేశాలు శివాజీ జయంతి రోజైన ఈ నెల 19 నుంచి అమలులోకి వస్తాయని ఆ రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్ సామంత్ బుధవారం పూణెలో వెల్లడించారు. ప్రతి రోజూ ఉదయం అన్ని కాలేజీల్లో తరగతులు ప్రారంభించటానికి ముందు జాతీయ గీతం ఆలాపించేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఫిబ్రవరి 19నాటికల్లా అన్ని కాలేజీలకు పంపనున్నట్లు వెల్లడించారు. దీన్ని అమలు చేసేందుకు ఇప్పటికే అన్ని కాలేజీలు సంసిద్ధత వ్యక్తంచేసినట్లు తెలిపారు.

ఈ ఆదేశాల ద్వారా ప్రతి రోజు మహారాష్ట్ర కాలేజీల్లో చదువుకుంటున్న 15 లక్షల మంది ప్రతిరోజూ జాతీయ గీతాలాపన చేయనున్నట్లు చెప్పారు. జాతీయ గీతాలాపన తప్పనిచేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం కూడా మహారాష్ట్రగా మంత్రి ఉదయ్ సామంత్ తెలిపారు. విద్యార్థుల్లో దేశ భక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు.
First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading