Singing Donkey : ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న సింగింగ్ డాంకీ..

పుణేలోని పశువుల పాకలో ఉన్న ఎమిలీ అనే గాడిద

Singing donkey : సాధారణంగా పశువులు గాయపడినప్పుడో.. లేక ఏదైనా ఆపద నుంచి రక్షించినప్పుడో.. వాటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని RESQ చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ జెస్సికా తెలిపారు. మొదటిసారి ఇలా గాడిద పాడుతున్న వీడియోను పోస్ట్ చేశామని.. అది కాస్త వైరల్‌గా మారందని తెలిపారు.

  • Share this:
    ఎవరైనా కర్ణ కఠోరంగా పాడుతుంటే.. వారి గొంతును గాడిదతో పోల్చడం కామన్. చాలా సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్‌లో గాడిద వాయిస్‌ వినిపిస్తూ అలాంటి సన్నివేశాలు చూపిస్తుంటారు. అలాంటిది నిజంగా గాడిదనే పాడటం మొదలుపెడితే ఎలా ఉంటుంది..? మిగతావాళ్లకేమో తెలియదు కానీ..ఆ గాడిదను పెంచుతున్నవాళ్లు మాత్రం దాని గాత్రానికి సంబరపడిపోతున్నారు. పుణేలో RESQ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ పశువుల పాకలో ఉంటున్న ఆ గాడిద వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఆ గాడిదకు ఎమిలీ అని పేరుపెట్టినట్టు అక్కడి నిర్వాహకులు తెలిపారు.

    సాధారణంగా పశువులు గాయపడినప్పుడో.. లేక ఏదైనా ఆపద నుంచి రక్షించినప్పుడో.. వాటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని RESQ చారిటబుల్ ట్రస్ట్ చీఫ్ జెస్సికా తెలిపారు. మొదటిసారి ఇలా గాడిద పాడుతున్న వీడియోను పోస్ట్ చేశామని.. అది కాస్త వైరల్‌గా మారందని తెలిపారు. నిజానికి ఎమిలీకి ఆకలైనప్పుడు అలా పాడటం మొదలుపెడుతుందని.. ట్రీట్ బకెట్(పశువులకు దానా పెట్టే బకెట్) ముందు తన వద్దకే తీసుకురావాలన్న ఉద్దేశంతో అలా అరుస్తుందని చెప్పారు. రెండేళ్ల క్రితం గాయాలతో వీధుల్లో తిరుగుతుండగా.. ఎమిలీని రక్షించి పశువుల పాకకు చేర్చామని తెలిపారు. మొదట్లో అది మౌనంగా, డిప్రెషన్‌లో ఉన్నట్టుగా ఉండేదని.. రాను రాను బాగా అలవాటుపడి పోయిందని చెప్పారు.
    First published: