చంద్రయాన్-2 కీలక ఘట్టం.. నేడే చంద్రుని కక్ష్యలోకి..

ISRO Chandrayaan-2 : ఇప్పటివరకు భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహం..నేడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. మంగళవారం ఉదయం 8.30గంటల నుంచి 9.30గంటల మధ్యలో జరగబోయే ఈ కీలక ఘట్టానికి ఇస్రో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ వెల్లడించారు.

news18-telugu
Updated: August 20, 2019, 8:47 AM IST
చంద్రయాన్-2 కీలక ఘట్టం.. నేడే చంద్రుని కక్ష్యలోకి..
శ్రీహరికోట నుంచి చంద్రయాన్-2 లాంచ్ (File Photo)
news18-telugu
Updated: August 20, 2019, 8:47 AM IST
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం నేడు జరగనుంది. ఇప్పటివరకు భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహం..నేడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. మంగళవారం ఉదయం 8.30గంటల నుంచి 9.30గంటల మధ్యలో జరగబోయే ఈ కీలక ఘట్టానికి ఇస్రో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ వెల్లడించారు.

చంద్రయాన్-2 ప్రయోగంలో ఇదే అత్యంత సంక్లిష్టమైనదిగా చెప్పారు. ఒకవేళ చంద్రయాన్-2 ఉపగ్రహం అంచనా వేగం కంటే ఎక్కువ
వేగంతో చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తే ప్రయోగం గాడి తప్పే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ తక్కువ వేగంతో కక్ష్యలోకి ప్రవేశిస్తే.. చంద్రుడి గురుత్వాకర్షణ ఉపగ్రహాన్ని లాగే అవకాశం ఉంటుంది. అదే జరిగితే చంద్రుడి ఉపరితలంపై ఉపగ్రహం కుప్పకూలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఘట్టాన్ని విజయవంతం చేయడానికి ఇస్రో తీవ్రంగా కృషి చేస్తోంది. తాజా ప్రయోగాన్ని బెంగళూరు సమీపంలో గల బైలాలులోని ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ యాంటీనా సాయంతో పర్యవేక్షించనున్నారు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...