ఇమ్రాన్‌కు సిద్దు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?

ముందు నుంచి చెబుతూ వస్తున్నట్టుగానే ఆయన ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

news18-telugu
Updated: August 18, 2018, 3:29 PM IST
ఇమ్రాన్‌కు సిద్దు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
నవజోత్ సింగ్ సిద్దు, ఇమ్రాన్ ఖాన్(File)
  • Share this:
పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ నేడు పాకిస్థాన్‌ 22వ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పాక్ రాజధానిలో శనివారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు రాజకీయ నేతలు, సైనిక అధికారులు, క్రీడాకారులు హాజరయ్యారు. భారత్ నుంచి మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇమ్రాన్‌కు శుభాకాంక్షలు తెలిపిన సిద్దు కశ్మీరి శాలువాను ఆయనకు కానుకగా ఇచ్చారు.

కాగా, ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లవద్దంటూ సుబ్రహ్మణ్యస్వామి లాంటి బీజేపీ నేతల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ.. సిద్దు వాటిని పట్టించుకోలేదు. ముందు నుంచి చెబుతూ వస్తున్నట్టుగానే ఆయన ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకోసం ఒకరోజు ముందుగానే సిద్దు పాక్ చేరుకున్నారు. పాక్‌కి బయలుదేరేముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లకు కూడా ఇమ్రాన్ ఆహ్వానాలు పంపించినప్పటికీ.. వారు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాక్ మాజీ క్రికెటర్లు రమీజ్ రాజా, వసీం అక్రమ్ తదితరులు హాజరయ్యారు.1992లో ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోనే పాక్‌ తొలి ప్రపంచకప్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.

తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ఆర్థిక స్థితిగతులపై ప్రత్యేక ఫోకస్ పెడుతానని ఇమ్రాన్ ఇదివరకే ప్రకటించారు. గత ఏడాది నుంచి పాకిస్తాన్ కరెన్సీ రూపాయి దారుణంగా పతనమవుతూ వస్తుండటంతో.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: August 18, 2018, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading