Home /News /national /

SIDHU MOOSEWALA PET DOGS HEARTBROKEN AFTER HIS DEATH REFUSE TO EAT FOOD PVN

Viral Video : సిద్ధూ మూసేవాలా మృతితో ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు

సిద్ధూ మరణంతో ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు

సిద్ధూ మరణంతో ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు

Sidhu Moosewala Pet Dogs Heartbroken: కాంగ్రెస్ నేత, పంజాబ్ ఫేమస్ గాయకుడు సిద్ధూ మూసే వాలాను (Sidhu Moose Wala) ఆదివారం దుండగులు గన్ తో కాల్చి అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.

Sidhu Moosewala Pet Dogs Heartbroken: కాంగ్రెస్ నేత, పంజాబ్ ఫేమస్ గాయకుడు సిద్ధూ మూసే వాలాను (Sidhu Moose Wala) ఆదివారం దుండగులు గన్ తో కాల్చి అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. మాన్సా జిల్లాలోని తన గ్రామ సమీపంలో ఇద్దరు స్నేహితులతో మ‌హేంద్ర థార్ వాహ‌నంలో వెళ్తున్న సిద్ధూ మూసే వాలాను సుమారు ప‌ది మంది చుట్టుముట్టి కాల్చారు. పంజాబ్(Punjab) ప్రభుత్వం మూసేవాలా (Sidhu Moose Wala) భద్రతను తగ్గించిన 24 గంటలలోపే జరిగిన ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. సిద్ధూ మూసే వాలా శ‌రీరంపై 24 చోట్ల బుల్లెట్ గాయాలు ఉన్న‌ట్లు అటాప్సీ రిపోర్ట్‌లో తేలింది. కేవ‌లం రెండు నిమిషాల లోపే సుమారు 30 రౌండ్ల కాల్పులు జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్ట‌మ్ త‌ర్వాత సిద్దూ భౌతిక‌దేహాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించారు. స్వ‌గ్రామంలో సిద్దూకు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. భారీ సంఖ్య‌లో అభిమానులు, జ‌నం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు.

సిద్ధూ మూసేవాలా హత్య వార్త అత‌డి కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, అభిమానుల‌ను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా.. అత‌డి పెంపుడు కుక్కలను కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. సిద్ధూ క‌నిపించ‌క‌పోవ‌డంతో ముద్ద కూడా ముట్ట‌డం లేదు అతడి పెంపుడు కుక్కలు. ఈ హృద‌య విదార‌క వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియోలో ఓ కుక్క విచారంగా మూలకు కూర్చోగా, మ‌రో కుక్క బాధ‌తో అరుస్తూ క‌నిపించింది. ఈ వీడియో నెటిజ‌న్ల‌కు క‌న్నీళ్లు తెప్పిస్తోంది. వీడియో చూసిన‌వారంతా బ్రోకెన్ హార్ట్ ఎమోజీల‌తో కామెంట్ చేస్తున్నారు. ఈ రెండు పెంపుడు కుక్క‌ల‌నీ సిద్దూ ఎంతో ప్రేమ‌గా చూసుకునేవాడ‌ని అత‌డి కుటుంబ స‌భ్యులు తెలిపారు.


ALSO READ Viral Video: రోజూ పకోడీ తింటే మధ్య ప్రదేశ్ తగ్గదు..కార్యకర్తతో మమత సంభాషణ వైరల్

సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala) జూన్ 17, 1993న జన్మించిరు. ఆయన మాన్సా జిల్లాలోని మూసే వాలా గ్రామానికి చెందినవాడు. మూసే వాలాకు మిలియన్ల కొద్దీ అభిమానుల ఫాలోయింగ్ ఉన్నారు. అతని ర్యాప్‌కు ప్రసిద్ధి చెందింది. మూస్ వాలా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. కాలేజీ రోజుల్లో సంగీతం నేర్చుకున్న అతను ఆ తర్వాత కెనడాకు వెళ్లాడు. కాగా, మూస్ వాలా అత్యంత వివాదాస్పద పంజాబీ గాయకులలో (Punjabi singer) ఒకరిగా కూడా పేరు పొందారు.

తుపాకీ సంస్కృతిని బహిరంగంగా ప్రచారం చేస్తూ, రెచ్చగొట్టే పాటల్లో గ్యాంగ్‌స్టర్‌లను కీర్తిస్తున్నారు. సెప్టెంబర్ 2019లో విడుదలైన అతని పాట 'జట్టి జియోనే మోర్ ది బందూక్ వార్గీ', 18వ శతాబ్దానికి చెందిన సిక్కు యోధుడు మై భాగో గురించి వివాదానికి దారితీసింది. ఈ సిక్కు యోధుడిని పేలవంగా చూపించారని ఆరోపించారు. మూసే వాలా తర్వాత క్షమాపణలు చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Pet dog, Punjab, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు