Home /News /national /

SIDHU MOOSE WALA MURDER CASE ONE GANGSTER SHOT DEAD IN ENCOUNTER BETWEEN SUSPECTED KILLERS PUNJAB POLICE SK

Sidhu Moose Wala murder case: సిద్దూ మూసే వాలా హత్య కేసులో సంచలన మలుపు.. ఎన్‌కౌంటర్‌లో అనుమానితుడు హతం

సిద్దు మూసేవాలా

సిద్దు మూసేవాలా

Sidhu Moosewala Murder Case: మన్‌ప్రీత్ అలియాస్ మనుగోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లకు అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఇతడు షార్ప్ షూటర్. ముసేవాలా హత్య సమయంలో ఏకే-47 నుంచి మొదటి షాట్‌ను మన్‌ప్రీతే కాల్చాడు. ఆ తర్వాత మిగిలిన షూటర్లు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపారు.

ఇంకా చదవండి ...
    ప్రముఖ గాయకుడు సిద్దూ మూసే వాలా (Sishu Moose wala) హత్య కేసు సంచలన మలుపు తిరిగింది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న ఓ వ్యక్తి పోలీసులు కాల్పుల్లో మరణించాడు. పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లా చీచా భక్నా గ్రామంలో మూసేవాలా హత్యతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు హుటాహుటిన గ్రామానికి వెళ్లారు. ఓ ఇంట్లో ఇద్దరు అనుమానితులు ఉన్నట్లు గుర్తించారు. మూసేవాలా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న  మన్‌ప్రీత్ మన్నూ (Manpreet Mannu), జగ్‌రూప్ సింగ్ రూపా (Jagroop Roopa).. ఆ ఇంట్లో ఉన్నట్లు సీసీ ఫుటేజీ ద్వారా నిర్ధారించుకున్నారు. ఐతే పోలీసులను చూసి వారు కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌లో ఒకరు మరణించారు. ఘటనా స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పుల నేపథ్యంలో గ్రామస్తులెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.

     President Salary: రాష్ట్రపతి శాలరీ ఎంత? రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి సౌకర్యాలుంటాయి?



    ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోందని.. ఐతే అక్కడున్న వారు ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత లేదని SHO సుఖ్‌బీర్ సింగ్ తెలిపారు. వారు గ్యాంగ్‌స్టర్సా లేదంటే మిలిటెంట్లా అన్న విషయం తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మూసేవాలా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న మన్‌ప్రీత్, జగ్‌రూప్‌లే అక్కడ ఉన్నారని తెలిసింది. ఘటనా స్థలంలో పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఉన్నారు. ఈ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు సీల్ చేశారు. మన్‌ప్రీత్, జగ్‌రూప్ల స్వస్థలం పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లా. వీరిద్దరు గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ వద్ద పనిచేస్తున్నారు.





    కాగా, సిద్ధూ మూసే వాలా మే 29 న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని మూసా గ్రామం సమీపంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కొందరు వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో పంజాబ్, ఢిల్లీ, ముంబైకి చెందిన పోలీసులు పలువురు వ్యక్తులను అరెస్టు చేశారు. కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ సతీందర్‌జిత్ సింగ్, అలియాస్ గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించినట్లు విచారణలో తేలింది. ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సహాయంతో ఈ కుట్ర పన్నినట్లు తెలిసింది. ఇప్పటికే అరెస్టైన నిందితులు.. పోలీసుల విచారణలో కీలక విషయాలను వెల్లడించారు. మన్‌ప్రీత్ అలియాస్ మనుగోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లకు అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఇతడు షార్ప్ షూటర్. ముసేవాలా హత్య సమయంలో ఏకే-47 నుంచి మొదటి షాట్‌ను మన్‌ప్రీతే కాల్చాడు. ఆ తర్వాత మిగిలిన షూటర్లు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరిపారు. శరీరం మొత్తం బుల్లెట్లు దిగడంతో మూసేవాలా అక్కడికక్కడే మరణించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Encounter, Punjab

    తదుపరి వార్తలు