హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Sidhu Moose Wala Case : సిద్ధూ హత్య వెనుక మాస్టర్ మైండ్ ఇతడే

Sidhu Moose Wala Case : సిద్ధూ హత్య వెనుక మాస్టర్ మైండ్ ఇతడే

సిద్ధూ హత్య వెనుక మాస్టర్ మైండ్ ఇతడే

సిద్ధూ హత్య వెనుక మాస్టర్ మైండ్ ఇతడే

Sidhu Moose Wala Case : ఇటీవల ప్రముఖ పంజాబీ గాయకుడు,కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా(Sidhu Moosewala)దారుణ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల కారణాలు చూపుతూ ఇటీవలే సిద్ధూ మూసేవాలా సహా 424 ప్రముఖుల భద్రతను ఉపసంహరిస్తున్నట్లు పంజాబ్(Punjab)ప్రభుత్వం ప్రకటించింది.

ఇంకా చదవండి ...

Sidhu Moose Wala Case : ఇటీవల ప్రముఖ పంజాబీ గాయకుడు,కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా(Sidhu Moosewala)దారుణ హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల కారణాలు చూపుతూ ఇటీవలే సిద్ధూ మూసేవాలా సహా 424 ప్రముఖుల భద్రతను ఉపసంహరిస్తున్నట్లు పంజాబ్(Punjab)ప్రభుత్వం ప్రకటించింది. వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత, మాజీ పోలీసు అధికారులు, రాజకీయ నేతలు ఉన్నారు. ఆ మరుసటి రోజే మే 29న సాయంత్రం మాన్సా జిల్లాలో సిద్ధూ హత్యకు గురయ్యారు. ఆదివారం మాన్సా జిల్లాలోని తన గ్రామ సమీపంలో ఇద్దరు స్నేహితులతో మ‌హేంద్ర థార్ వాహ‌నంలో వెళ్తున్న సిద్ధూ మూసే వాలాను సుమారు ప‌ది మంది చుట్టుముట్టి కాల్చారు. సిద్ధూ మూసేవాలా మృతదేహంపై 19 తూటా గాయాల గుర్తులు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఇదిలాఉండగా, సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి (Mastermind) గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయేనని( Lawrence Bishnoi) తాజాగా ఢిల్లీ పోలీసులు(Delhi Police) తెలిపారు. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న అతడిని పలు దఫాలుగా విచారించిన ఢిల్లీ ప్రత్యేక పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ హత్య తమ గ్యాంగ్‌ పనేనని లారెన్స్‌ బిష్ణోయ్‌ ఇంతకుముందే పోలీసుల విచారణలో అంగీకరించాడు. మూసేవాలాతో తమకు వైరం ఉందని.. అందుకే తమ గ్యాంగ్‌ సభ్యులు అతడిని చంపేశారని పోలీసుల ఎదుట అంగీకరించినట్టు ఇటీవలే పోలీసులు తెలిపారు

ఇక, ఈ కేసులో ప్రధాన షూటర్‌కు సన్నిహితుడైన సిద్ధేశ్‌ కమ్లే అలియాస్‌ మహాకల్‌ను పుణెలో అరెస్టు చేసినట్టు కమిషనర్‌ (స్పెషల్‌ సెల్‌) హెచ్‌ఎస్‌ ధాలీవాల్‌ మీడియాకు తెలిపారు. అయితే, సిద్ధేశ్‌ కమ్లేకు..సిద్ధూను షూట్‌ చేయడంలో ప్రమేయం లేదని, అసలైన షూటర్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సిద్ధూ హత్య కేసుతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను గుర్తించామన్నారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసుపై ఢిల్లీ ప్రత్యేక పోలీస్‌ విభాగం పనిచేస్తోందని, నిందితులందరినీ సాధ్యమైనంత త్వరలోనే పట్టుకుంటామన్నారు. కేసు పంజాబ్‌లోనే నమోదైనప్పటికీ హంతకులను అరెస్టు చేసేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు.

Viral Video : రాంగ్ రూట్ లో ట్రిపుల్ డ్రైవింగ్..అడ్డుకున్న ట్రాఫిక్ పోలీస్ పై పరుగెత్తించి మరీ దాడి!

సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కలిశారు. మంగళవారం పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని మూసేవాలా ఇంటికి వెళ్లిన రాహుల్ గాంధీ ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. చండీగఢ్ విమానాశ్రయం నుండి కారులో నేరుగా వారి స్వగ్రామం మూసాకు వెళ్లి ఆయన కుటుంబంతో దాదాపు 50 నిమిషాలు గడిపారు. ముందుగా ఇంటిలోని మూసేవాలా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్, పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు పర్తాప్ సింగ్ బజ్వా, మాజీ ఉప ముఖ్యమంత్రి ఒపి సోనీ సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయన వెంట ఉన్నారు.

రూ.50వేలు కడితేనే కొడుకు మృతదేహాన్ని ఇస్తామన్న హాస్పిటల్.. భిక్షాటన చేస్తున్న తల్లిదండ్రులు!

సిద్ధూ మూసే వాలా (Sidhu Moose Wala) జూన్ 17, 1993న జన్మించిరు. ఆయన మాన్సా జిల్లాలోని మూసే వాలా గ్రామానికి చెందినవాడు. మూసే వాలాకు మిలియన్ల కొద్దీ అభిమానుల ఫాలోయింగ్ ఉన్నారు. అతని ర్యాప్‌కు ప్రసిద్ధి చెందింది. మూస్ వాలా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. కాలేజీ రోజుల్లో సంగీతం నేర్చుకున్న అతను ఆ తర్వాత కెనడాకు వెళ్లాడు. కాగా, మూస్ వాలా అత్యంత వివాదాస్పద పంజాబీ గాయకులలో (Punjabi singer) ఒకరిగా కూడా పేరు పొందారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Delhi police, Punjab

ఉత్తమ కథలు