Home /News /national /

SI MURDERED BY MAOISTS AFTER ABDUCTION IN CHHATTISGARH VB KMM

SI murdered by maoists: మరోసారి రెచ్చిపోయిన మావోలు.. కిడ్నాప్ చేసిన ఎస్ఐను హత్య చేసిన మావోయిస్టులు.. నెత్తురోడుతున్న దండకారణ్యం

ఎస్ఐ మృతదేహం

ఎస్ఐ మృతదేహం

SI murdered by maoists: ఏప్రిల్ 21న బీజాపూర్ జిల్లా వద్ద కిడ్నాప్ కు గురైన సబ్ ఇన్స్పెక్టర్ తాటి మురళిని మావోయిస్టులు హత్య చేశారు. ప్రజల సమక్షంలో ప్రజా కోర్టు పెట్టి హత్య చేసిన మావోలు మల్లూరు రోడ్డుపై జీఎల్ఎస్ హాస్పిటల్ దగ్గర నడి రోడ్డుపై శవాన్ని వదిలి వెళ్లారు.

ఇంకా చదవండి ...
    ఇటీవల కాలంలో 22 మందికి పైగా పోలీసులను పొట్టనబెట్టుకున్న మావోయిస్టులు తాజాగా మరో ఎస్ఐను దారుణంగా చంపారు. బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలనార్ వద్ద మూడు రోజుల క్రితం ఇబీజాపూర్‌ జిల్లాలోని జగదల్పూర్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళి తాతి కిడ్నాప్ కు గురయ్యారు. ఈ నెల మొదటి వారంలో పోలీసులకి, మావోయిస్ట్‌లకి జరిగిన ఎంకౌంటర్‌లో మురళి ప్రమేయం ఎక్కువగా ఉందని కిడ్నాప్ చేశారు. అతడిని పుల్సుమ్ పారా వద్ద హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపై మావోయిస్టులు పడేశారు. ఛత్తీస్ ఘడ్ లోని పలు ఆదివాసీ గ్రామాల్లో అమాయక ఆదివాసీ గిరిజనులను హత్య చేసిన ఘటనలతో పాటు మహిళలను అత్యాచారం చేసాడని, అతనికి పలుమార్లు హెచ్చరికలు కూడా చేశామని, అయినా అతని ప్రవర్తన మార్చుకోకపోవడంతో ప్రజాకోర్టు నిర్వహించి చంపామని మావోయిస్టులు మృతదేహం వద్ద లేఖ వదలి పెట్టి వెళ్లారు.

    దండకారణ్యంలో పోలీసులకు సహకరించి తమపై ఎవరు ఎలిగేషన్ పెట్టినా.. ఎంతటి వారికైనా ఇదే గతి పడుతుందని మావోయిస్టులు కరపత్రంలో తెలిపారు. చర్చలు జరుగుతాయనుకున్న సమయంలోనే ఇలాంటి దాడులు జరుగుతుండటంతో దండకారణ్యమంతటా ఆందోళన నెలకొంది.

    ఘటనా స్థలం వద్ద ఎస్ఐ మృతదేహం


    మావోయిస్టుల లేఖ


    కాగా మురళి తాతి 2018లో జగదల్‌పూర్‌లో జాయిన్ అయ్యారు. అంతకుముందు ఆయన బీజాపూర్‌లో పనిచేశారు. మూడు రోజులుగా మురళి ఆచూకీ కోసం గోండ్వానా సమితి వారు, మురళి బంధువులు మావోయిస్టులకు మురళిని విడిచిపెట్టమని కోరిన సంగతి తెలిసిందే.
    Published by:Veera Babu
    First published:

    Tags: Chatisghad, Crime, Crime news, Maoists, Murder, Telangana

    తదుపరి వార్తలు