HOME »NEWS »NATIONAL »shrishti goswami becomes chief minister for a day what she done su

Shrishti Goswami: ఒక్క రోజు ముఖ్యమంత్రిగా శ్రిష్టీ గోస్వామి.. ఏం చేసిందో తెలుసా?

Shrishti Goswami: ఒక్క రోజు ముఖ్యమంత్రిగా శ్రిష్టీ గోస్వామి.. ఏం చేసిందో తెలుసా?
శ్రిస్తీ గోస్వామి (File Image)

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఓ 19 ఏళ్ల బాలిక తన కోరికను నేరవేర్చింది. ఒక్కరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించింది.

  • Share this:
    జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఓ 19 ఏళ్ల బాలిక తన కోరికను నేరవేర్చింది. ఒక్కరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించింది. వివరాలు.. ఉత్తరాఖండ్‌ హరిద్వార్ జిల్లాలోని దౌలత్‌పూర్ గ్రామానికి చెందిన శ్రిష్టీ గోస్వామి ఆ రాష్ట్రానికి ఒక్క రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంలోని పలు శాఖలకు సంబంధించిన వివరాలను అధికారులు ఆమెకు వివరించారని ఉత్తరాఖండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ తెలిపింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు వివిధ ప్రభుత్వ విభాగంలో అమలవుతున్న పథకాలపై ఆమె రివ్యూ చేపట్టారు. రాష్ట్ర విధాన సభలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం కేదారపురంలోని బాలికా నికేతన్‌కు శ్రిష్టీ చేరుకున్నారు. అక్కడి పిల్లలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడే పిల్లలతో కలిసి భోజనం చేశారు. బాలికా నికేతన్‌లోని పిల్లలు తమ నైపుణ్యాలను ఒక్క రోజు ముఖ్యమంత్రి మందు ప్రదర్శించారు.

    తనకు ఈ అవకాశం దక్కడంపై శ్రిష్టీ గోస్వామి ANIతో మాట్లాడుతూ.. "జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా నాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని చెప్పారు. ఇందుకు సంబంధించి శ్రిష్టీ తల్లిదండ్రులు స్పందిస్తూ.. "ఈ రోజు మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. ప్రతి కూతురు ఒక మైలురాయిని సాధించగలదు.. అందుకు మనం మద్దతుగా నిలవాలి. ఇందుకు తమ కూతురు అర్హురాలిగా భావించినందుకు ప్రభుత్వానికి మేముకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ కుమార్తెలను మద్దతుగా నిలవడాన్ని ఎప్పటికీ అపకండి. నేటి కాలంలో కూతుళ్లు ప్రతీది సాధించగలరు. ఇది అందరికీ ఒక ఊదాహరణగా ఉండాలి"అని తెలిపారు.



    ఇక, శ్రిష్టీ గోస్వామి తండ్రి ఓ వ్యాపారి. దౌలతాపూర్ గ్రామంలో వీరి ఫ్యామిలీ నివాసం ఉంటోంది. ఈ అవకాశం అనుకోకుండా వచ్చినదేమీ కాదు. శ్రిష్టీ గోస్వామి… ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న చాలా పథకాలకు పనిచేసింది. అంతేకాదు… అంతర్జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమాల్లో కూడా పాల్గొంది.
    Published by:Sumanth Kanukula
    First published:January 24, 2021, 19:34 IST