వలస కూలీల రైలు... 20 బోగీలు వదిలేసి వెళ్లిపోయిన ఇంజిన్...

వలస కూలీలను తీసుకుని వెళ్తున్న శ్రామిక్ స్పెషల్ ట్రైన్.. 20 బోగీలను వదిలేసి వెళ్లిపోయింది.

news18-telugu
Updated: May 10, 2020, 6:26 PM IST
వలస కూలీల రైలు... 20 బోగీలు వదిలేసి వెళ్లిపోయిన ఇంజిన్...
నమూనా చిత్రం
  • Share this:
వలస కూలీలను తీసుకుని వెళ్తున్న శ్రామిక్ స్పెషల్ ట్రైన్.. 20 బోగీలను వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఎప్పటికో విషయం తెలిసి అధికారులు పరిస్థితిని చక్కదిద్దారు. గుజరాత్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని సూరత్ నుంచి 1200 మంది వలస కూలీలతో రైలు ఉత్తర్ ప్రదేశ్ వెళ్తోంది. 20 బోగీలను వెనుకే వదిలేసి ఇంజిన్ కదిలిపోయింది. ఈ విషయాన్ని గార్డు స్టేషన్ మాస్టర్‌కు తెలియజేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు కేవలం ఇంజిన్ వెనుక మూడుబోగీలు మాత్రమే తగిలించి ఉన్నాయి. మిగిలిన 20 బోగీలు వెనుకే ఉండిపోయాయి. యూపీలోని బతౌలి స్టేషన్‌లో రైలు బోగీలు విడిపోయినట్టు తెలిసింది. ఇంజిన్ ముందుకు వెళ్లిపోవడంతో వెనుక 20 బోగీల్లో ఉన్న వలస కార్మికులు ఈ విషయాన్ని తమకు తెలిసిన వారికి చెప్పారు. కొన్ని ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. ఉదయం 7 గంటలకు బోగీలను వదిలి ఇంజిన్ వెళ్లిపోగా... మళ్లీ 11 గంటల సమయంలో వెనక్కు తీసుకొచ్చి బోగీలను తగిలించి పంపించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: May 10, 2020, 6:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading