దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగిని శ్రద్ధా వాకర్ హత్య కేసులో.. నిందితుడైన అఫ్తాబ్ పూనావాలా పోలీసులకు చెప్పింది కట్టుకథ అని అర్థమైంది. తాను గంజాయి మత్తులో గొంతు నొక్కి హత్య చేశానని ఆఫ్తాబ్ చెప్పగా.. తాజా ఆధారం ఒకటి.. అతను చెప్పింది పూర్తి అబద్ధం అని తేల్చుతోంది. శ్రద్ధావాకర్ రెండేళ్ల కిందట తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలోని సొంత పట్టణమైన వాసాయ్లో పోలీసులకు ఓ కంప్లైంట్ ఇచ్చింది. అందులో ఏమని చెప్పిందో తెలుసా? తన బాయ్ ఫ్రెండ్ తనను చంపేసేలా ఉన్నాడని తెలిపింది. ఓ ఫ్లాట్‌లో ఆఫ్తాబ్ ఆమెను కొట్టడంతో.. ఆమె ఆ కంప్లైంట్ ఇచ్చింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత అదే ఆఫ్తాబ్ ఆమెను గొంతు నొక్కి చంపి.. శరీరాన్ని 35 భాగాలుగా చేసి.. ఫ్రిజ్‌లో దాచి.. అప్పుడప్పుడూ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో, అడవిలో విసిరేశాడు. అంటే.. ఆఫ్తాబ్తో తనకు ప్రాణ హాని ఉందని శ్రద్ధకు రెండేళ్ల కిందటే తెలుసని అర్థమవుతోంది.
పేరెంట్స్‌కి తెలుసు
ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఆఫ్తాబ్ ఆమెను కొడుతున్న విషయం.. అతని తల్లిదండ్రులకు తెలుసని చెప్పారు. శ్రద్ధా అప్పుడు ఇచ్చిన కంప్లైంట్‌ని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు పరిశీలించబోతున్నారు. ఆ కంప్లైంట్‌పై వాసాయ్ పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేశారో తెలుసుకోబోతున్నారు. అలాగే ఆఫ్తాబ్ తల్లిదండ్రులను కూడా ప్రశ్నించబోతున్నారు. ఆఫ్తాబ్ తనపై రెండేళ్ల కిందట జరిగిన దాడి గురించి.. కాల్ సెంటర్ లోని మరో తోటి ఉద్యోగి కరణ్‌కి చెప్పింది. ఆ కరణ్ ద్వారానే ఢిల్లీ పోలీసులకు.. రెండేళ్ల కిందట ఇచ్చిన కంప్లైంట్ గురించి తెలిసింది.
నవంబర్ 23, 2020లో శ్రద్ధా.. లిఖిత పూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ తాలూకు లెటర్ని కరణ్‌కి వాట్సాప్‌లో పంపింది. ఆ లెటర్తోపాటూ.. గాయాలతో ఉన్న తన ఫేస్ ఫొటోని కూడా షేర్ చేసింది. ఈ దాడి జరిగిన వారం తర్వాత ఆమె అంతర్గత గాయాల వల్ల ఆస్పత్రిలో చేరింది. "ఈ రోజు ఆఫ్తాబ్ నన్ను చంపాలని యత్నించాడు. నా గొంతు నొక్కాడు. భయపెట్టాడు. బ్లాక్ మెయిల్ చేశాడు. నన్ను చంపి, ముక్కలుగా కోసి.. ఎక్కడెక్కడో పడేస్తానని బెదిరించాడు. గత ఆరు నెలలుగా తను నన్ను కొడుతూనే ఉన్నాడు. కానీ నాకు పోలీసుల్ని కలిసేంత ధైర్యం లేదు. ఎందుకంటే తను నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు" అని కరణ్‌కి వాట్సాప్‌లో తెలిపింది శ్రద్ధ. అప్పుడు ఆమె ఏం చెప్పిందో.. రెండేళ్ల తర్వాత అదే జరిగింది.
RS Virus : కరోనాకి తోడుగా మరో వైరస్.. పిల్లలకు జోరుగా వ్యాప్తి..
ఎందుకిలా?
శ్రద్ధ, ఆఫ్తాబ్.. 2019లో ఓ డేటింగ్ యాప్ ద్వారా కలిశారు. రిలేషన్షిప్ మొదలైంది. ఇద్దరూ కాల్ సెంటర్ ఉద్యోగులే కావడంతో.. త్వరగానే రిలేషన్షిప్ మొదలైంది. ఆ తర్వాత వారు.. ఈ సంవత్సరం మేలో.. ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. ఈ రిలేషన్‌ను శ్రద్ధా పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఢిల్లీలోని మెహ్రౌలీలోని ఫ్లాట్‌లో దిగిన కొన్ని రోజులకే ఈ హత్య జరిగింది. శ్రద్ధ స్నేహితులు.. ఆమె తండ్రికి కాల్ చేసి.. కొన్ని నెలలుగా ఆమె తమతో కాంటాక్ట్‌లో లేదని చెప్పడంతో.. శ్రద్ధా తండ్రి పోలీసుల్ని ఆశ్రయించడంతో.. ఈ హత్య కేసు నవంబర్‌లో వెలుగులోకి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi, Maharashtra, Shraddha Kapoor