ఉద్యోగులకు ఐటీ కంపెనీల షాక్... ఓటు వేసినట్టు ప్రూఫ్ చూపాల్సిందే ?

పోలింగ్ రోజున వేతనంతో కూడిన మంజూరు చేసినప్పటికీ... పలు కంపెనీలు కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు కచ్చితంగా తాము ఓటు వేసినట్టుగా ఏదో ఒక ఆధారాన్ని హెచ్ఆర్ విభాగంలో సమర్పించాల్సిందే అని పలు కంపెనీలు నిబంధన విధించినట్టు సమాచారం.

news18-telugu
Updated: April 12, 2019, 8:41 AM IST
ఉద్యోగులకు ఐటీ కంపెనీల షాక్... ఓటు వేసినట్టు ప్రూఫ్ చూపాల్సిందే ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్ నగరాల్లో ఉన్న ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పోలింగ్ రోజున వేతనంతో కూడిన మంజూరు చేసినప్పటికీ... కంపెనీలు కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు కచ్చితంగా తాము ఓటు వేసినట్టుగా ఏదో ఒక ఆధారాన్ని హెచ్ఆర్ విభాగంలో సమర్పించాల్సిందే అని పలు కంపెనీలు నిబంధన విధించినట్టు సమాచారం. అలా చేసిన వారికి మాత్రమే ఆ రోజు వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తామని కొన్ని కంపెనీలు స్పష్టం చేశాయి. లేదంటే జీతంలో కోత తప్పదని పలు కంపెనీలు ఉద్యోగులకు ముందుగానే హెచ్చరించాయి.

అయితే కంపెనీ ఉత్తర్వులతో పలువురు ఉద్యోగులు డైలమాలో పడిపోయినట్టు తెలుస్తోంది. గురువారం పోలింగ్ సెలవు, రెండు వీకెండ్ సెలవులు, మధ్యలో మరో రోజు సెలవు పెట్టుకుంటే వరుసగా నాలుగు రోజులు ఎంజాయ్ చేయొచ్చని భావించిన ఐటీ ఉద్యోగులకు కంపెనీలు ఒకరకంగా ఝలక్ ఇచ్చాయని తెలుస్తోంది. మరోవైపు ఐటీ కంపెనీల హెచ్చరికలతో ఉద్యోగులందరూ ఓటింగ్‌లో పాల్గొంటే... బెంగళూరు, మైసూర్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఓటింగ్ రోజు కచ్చితంగా సెలవు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... పలు ఐటీ కంపెనీలు ఈ రకమైన నిబంధనలు పెట్టడం ప్రాధాన్యత సంతకరించుకుంది.


First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...