కొందరి తప్పుకి అందర్నీ నిందించొద్దు... ‘తబ్లిగీ’పై మోహన్ భగవత్

మోహన్ భగవత్(File Photos)

కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడానికి ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కారణమని ఆరోపణలు వస్తున్న వేళ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

  • Share this:
    కొందరు చేసిన తప్పు వల్ల అందర్నీ నిందించవద్దని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. ఆన్ లైన్ ద్వారా మోహన్ భగవత్ సందేశాన్ని వినిపించారు. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడానికి ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కారణమని ఆరోపణలు వస్తున్న వేళ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కొన్ని భారత వ్యతిరేక శక్తులు పొంచి ఉన్నాయని చెప్పారు. ‘శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పరిపాలన విభాగం మీద ఉంటుంది. ఎవరైనా తప్పు చేస్తే మొత్తం కమ్యూనిటీని దూరం చేయకూడదు. ప్రజలు ఆగ్రహం చెందొద్దని కమ్యూనిటీ లీడర్లు చెప్పాల్సిన బాధ్యత ఉంది.’ అని మోహన్ భగవత్ అన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో నమోదైన కరోనా కేసుల్లో ఐదింట ఒకటి తబ్లిగీ జమాత్‌తో లింక్ ఉందని చెబుతున్నాయి.

    మరోవైపు పాల్‌గఢ్ మూకదాడి అంశంపై మోహన్ భగవత్ స్పందించారు. సాధువులను కొట్టి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ‘ప్రజల క్షేమం కోసం ప్రార్థించే సాధువులను దారుణంగా కొట్టి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉంది’ అని అన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: