రుణ మాఫీ అందరికీ చేయాలా? కుమారస్వామి సన్నాయి నొక్కులు

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 3:15 PM IST
రుణ మాఫీ అందరికీ చేయాలా? కుమారస్వామి సన్నాయి నొక్కులు
  • News18
  • Last Updated: June 6, 2018, 3:15 PM IST
  • Share this:
రైతు రుణ మాఫీ.  కర్నాటక రైతులతో పాటు   ప్రతిపక్షం బీజేపీ చేస్తున్నప్రధాన డిమాండ్  ఇది. వాస్తవానికి బీజేపీతో పాటు జేడీఎస్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీని ప్రస్తావించాయి. కానీ కాంగ్రెస్ మెనిఫెస్టోలో రుణమాఫీ ఊసేలేదు. ఇప్పుడు జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేశాయి. దీంతో రుణమాఫీ చేస్తాయా? లేదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  ఈ క్రమంలోనే రైతులతో సమావేశమైన  సీఎం కుమారస్వామి రుణమాఫీకి 15 రోజుల గడువు కోరాడు.

కర్నాటకలోని 30 జిల్లాల నుంచి వచ్చిన రైతు ప్రతినిధులతో కుమార స్వామి చర్చలు జరిపారు. రుణమాఫీకి సంబంధించి వారి నుంచి అభిప్రాయాలను కోరారు.  వ్యవసాయ రుణాల పేరుతో ఎంతో మంది బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నారని.. వాటితో కొందరు బైకులు కంటే మరికొందరు పెళ్లిళ్లు చేసుకున్నారని రైతులతో అన్నారు. మరికొందరు పెస్టిసైడ్స్ షాపులు పెట్టారని.. అలాంటి వారందరికీ కూడా రుణ మాఫీ చేయాలా? ఇది కరెక్టెనా? అని సన్నాయి నొక్కులు నొక్కారు.

అందుకే రైతు రుణాలను పూర్తిగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని.. అందరికీ మాఫీ చేయడం సాధ్యం కాదని స్పష్టంచేశారు.  పేద రైతుల కోసమే ప్రయోజనం దక్కాలని అన్నారు. అందు కోసం 15 రోజులు సమయం కావాలని..  ఆ తర్వాతే రుణమాఫీపై ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. వాస్తవానికి తమ పార్ట్ నర్ కాంగ్రెస్ తో చర్చించాకే.. నిర్ణయం తీసుకోవాలి. కానీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. సోనియా వైద్య పరీక్షల కోసం అక్కడికి వెళ్లారు. దీంతో ఆయన వచ్చాకే దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది.

వాస్తవానికి తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోపేు రుణామాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు కుమారస్వామి. కానీ ఇప్పుడు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆయన తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎలాంటి షరతులు పెట్టకుండా.. అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: May 30, 2018, 1:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading