దిశా హత్యాచారం ఘటనపై యావత్ దేశం భగ్గుమంటోంది. నలుగురు నిందితులకు ఉరిశిక్ష వేయాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక సోమవారం పార్లమెంట్ ఉభయ సభల్లో వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్యపై చర్చ జరిగింది. ఈ దారుణ ఘటనను ఎంపీలంతా ఖండించారు. చట్టాలను మార్చి.. రేపిస్టులను కఠినంగా శిక్షించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ షాద్ నగర్ నిర్భయ ఘటనపై రాజ్యసభలో ఆవేశంగా ప్రసంగించారు. రేపిస్టులను జనాల మధ్యకు తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే ఉరితీయాలని డిమాండ్ చేశారు.
మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న మానవ మృగాలను ఎలాంటి క్షమాభిక్ష లేకుండా ఉరితీయాలి. నిర్భయకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఢిల్లీ నిర్భయ గానీ, కథువా ఘటన గానీ, హైదరాబాద్ డాక్టర్ హత్యాచారం గానీ.. ఇలాంటి కేసులో దోషుల పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. పలు దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలే శిక్షిస్తారు. ఈ కిరాతకులను ప్రజల మధ్యకు తీసుకొచ్చి చంపేయాలి.
— జయా బచ్చన్
అటు షాద్నగర్ నిర్భయ ఘటనపై తీవ్రంగా స్పందించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మహిళలపై దాడులు చేయడం ఒక సామాజిక రోగంగా మారపోయిందన్నారు. పోలీస్ వ్యవస్థలో కూడా చాలా లోపాలున్నాయన్నారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే... తమ పరిధి కాదని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. కేవలం కోర్టులు, చట్టాలు చేస్తే బాధితులకు న్యాయం జరగదన్నారు. ఈ పరిస్థితిపై మార్పు రావడానికి సమాజం అంతా కృషి చేయాలన్నారు
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.