IAF: భారత వాయుసేన అమ్ములపొదిలో అమెరికా యుద్ధ హెలికాప్టర్లు..

IAF Apache Helicopters: అమెరికాకు చెందిన అపాచీ ఏహెచ్‌-64 యుద్ధ హెలికాప్టర్లు భారత వైమానిక దళంలో చేరాయి. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లు గాల్లోకి ఎగిరాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 3, 2019, 11:20 AM IST
IAF: భారత వాయుసేన అమ్ములపొదిలో అమెరికా యుద్ధ హెలికాప్టర్లు..
అపాచీ యుద్ధ హెలికాప్టర్ (Photo: Twitter)
  • Share this:
భారత వాయుసేన బలం మరింతగా పెరిగింది. అమెరికాకు చెందిన అపాచీ ఏహెచ్‌-64 యుద్ధ హెలికాప్టర్లు భారత వైమానిక దళంలో చేరాయి. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం నుంచి ఈ యుద్ధ హెలికాప్టర్లు గాల్లోకి ఎగిరాయి. అంతకుముందు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా, పశ్చిమ ఎయిర్‌ కమాండర్‌ ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌ నంబియార్‌ తదితరులు హెలికాప్టర్ల పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ ఇప్పటికే 4 హెలికాప్టర్లను అందజేయగా తాజాగా 8 అధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అందజేసింది. 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబర్‌లో భారత వాయుసేన బోయింగ్‌ సంస్థతో ఒప్పందం చేసుకోగా 2020 నాటికి మొత్తం 22 హెలికాప్టర్లు భారత్‌కు చేరనున్నాయి.

ఈ యుద్ధ హెలికాప్టర్లు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పని చేస్తాయి. కాగా, ఈ హెలికాప్టర్‌కు సంబంధించి అన్ని రకాల ముందస్తు పరీక్షలు పూర్తి చేశామని వాయుసేన అధికారులు ప్రకటించారు. గగనతలంలోని, నేలపై ఉన్న టార్గెట్లను ఈ హెలికాప్టర్లు ఛేదిస్తాయి.

First published: September 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...