ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియం వేదికగా ప్రధాని మోదీ హోస్ట్‌గా జరిగిన పరీక్ష పే చర్చపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మోదీ తన మార్క్ మెసేజ్‌తో, అద్భుతమైన సూచనలతో విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఏడాది జరిగే సీబీఎస్‌ఈ పరీక్షలకు ముందు మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు తనదైన స్టైల్‌లో ఆన్సర్లు ఇస్తుంటారు మోదీ. ఆయన ఇచ్చే సలహాలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిఏడాది లాగే ఈసారి కూడా ఎగ్జామ్స్‌కి జీవితాన్ని లింక్ చేస్తూ విలువైన సూచనలిచ్చారు మోదీ. అందులో షార్ట్‌కట్స్ వద్దంటూ ఆయన చెప్పిన మెసేజ్ విద్యార్థులను కట్టిపడేసింది. ఇంతకీ మోదీ ఏం చెప్పారు. విద్యార్థులు మోదీని అడిగిన ప్రశ్నేంటి..?
Watch | Exams will come and go, we have to live life, live it to the fullest... so we should not take shortcuts in life as it is said, "Shortcuts will cut you short": PM @narendramodi@dpradhanbjp@PMOIndia#PPC2023#ParikshaPeCharcha pic.twitter.com/KKnZFw1S4F
— Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) January 27, 2023
జీవితంలో షార్ట్ కట్స్ వద్దు:
పరీక్షా పే చర్చలో మోదీ చెప్పిన సొలూషన్స్ అన్ని ఒక ఎత్తైతే.. పరీక్షల్లో చీటింగ్ వద్దంటూ ఆయన ఇచ్చిన మెసేజ్ మరో ఎత్తు. స్మార్ట్ వర్క్ లేక హార్డ్ వర్క్‌లో ఏదీ ఇంపార్టెంట్ అంటూ ఓ విద్యార్థి మోదీని ప్రశ్నించాడు. దీనికి మోదీని ఇచ్చిన సమాధానంతో కార్యక్రమ ప్రాంగణం చప్పట్లతో మోరుమోగిపోయింది. కొంతమంది తెలివితో వర్క్ చేస్తారని.. మరికొంతమంది తెలివిగా కష్టపడతారన్నారు మోదీ. అయితే కొంత మంది విద్యార్థులు వారి సృజనాత్మకతను పరీక్షల్లో చీటింగ్ చేసేందుకు ఉపయోగిస్తున్నారని... ఆ తెలివిని మంచి మార్గానికి వాడుకుంటే జీవితంలో విజయాలు సాధిస్తామన్నారు. జీవితంలో ఎప్పుడూ షార్ట్‌కట్స్ వెతుక్కోకూడదంటూ మంచి మెసేజ్ ఇచ్చారు మోదీ.
గ్యాడ్జెట్లకు అడిక్ట్ కావద్దు:
అటు విద్యార్థులు ఎక్కువగా టీవీ, ఫోన్‌లకు అతుక్కుపోవద్దంటూ మోదీ కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు ఫోన్‌కు అడిక్ట్ అవ్వడం పట్ల మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాడ్జెట్లకు బానిసలవద్దంటూ సూచించారు. మొబైల్‌తో పాటు ఇతర గ్యాడ్జెట్లను పదేపదే వాడే అలవాటును తగ్గించుకోవాలని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో సుమారు 39 లక్షల మంది పాల్గొన్నారు. 9-12వ తరగతి చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారు. ఇక వచ్చే నెల 15నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు జరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Narendra modi, Pariksha Pe Charcha, Students