హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కంటపడ్డారో ఖతమే.. జనాలను చంపి రక్తం తాగుతున్న పులి.. కనిపిస్తే కాల్చిపారేయండి

కంటపడ్డారో ఖతమే.. జనాలను చంపి రక్తం తాగుతున్న పులి.. కనిపిస్తే కాల్చిపారేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. అడవిలోకి వెళ్లి పులి కోసం గాలిస్తున్నారు. అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఆ దట్టమైన అభయారణ్యంలో పులి ఎక్కడుందో తెలుసుకునేందుకు ఏనుగుల సాయం తీసుకుంటున్నారు

ఇటీవల జనాలపై వన్యప్రాణుల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణలో పులులు, ఏపీలోని అటవీ ప్రాంతాల్లో ఏనుగులు అలజడి రేపుతున్నాయి. ఇప్పటికే ఎంతో మందిని పొట్టన బెట్టుకున్నాయి. ఇక కర్నాటకలోనూ ఓ పెద్దపులి బీభత్సం సృష్టిస్తోంది. పచ్చటి గ్రామాల్లో రక్తపు టేరులు పారిస్తోంది. కొడగు జిల్లా నాగర్‌హోళ్ అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. తోటల్లో పనిచేసే కూలీలపై దాడి చేసి చంపుతోంది. పశువులు, పెంపుడు జంతువులపైనా పంజా విసురుతోంది. నాగర్‌హోళ్‌లో వారం రోజుల వ్యవదిలో నలుగురిని పొట్టనబెట్టుకుంది. మరో 16 పశువులు, పెంపడు జంతువులను కూడా చంపేసింది.

ఇటీవల కూలీ పనికి వెళ్లిన కుటుంబంపైనా పులి దాడి చేసింది. పులి దాడిలో ఎనిమిదేళ్ల బాలుడు చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో కొడకు జిల్లా ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా అడవుల్లో ఉండే గ్రామల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మనుషుల చంపేసి రక్తం తాగుతున్న ఆ భీకర పులి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆందోళనలు కూడా చేశారు. రోడ్లపై బైఠాయించి ధర్నాలు చేశారు. కొడగు రక్షణ వేదికతో పాటు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ప్రజలకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఆందోళనకు దిగారు.

ప్రజల ఆందోళనతో కర్నాటక అటవీశాఖ మంత్రి అరవింద్ లింబవళ్లి స్పందించారు. పులి కనిపిస్తే కాల్చి చంపేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు.. అడవిలోకి వెళ్లి పులి కోసం గాలిస్తున్నారు. అడుగడుగునా జల్లెడ పడుతున్నారు. ఆ దట్టమైన అభయారణ్యంలో పులి ఎక్కడుందో తెలుసుకునేందుకు ఏనుగుల సాయం తీసుకుంటున్నారు. పులిపై దాడి చేసేందుకు తుపాకలు, మత్తు బాణాలు, ఈటెలను తీసుకెళ్లారు. అంతేకాదు అడవిలో పలు చోట్ల ట్రాప్స్ ఏర్పాటు చేశారు. పులి కనిపిస్తే వెంటనే బంధిస్తామని.. అది సాధ్యం కాకుంటే చంపేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

First published:

Tags: Karnataka, Tiger, Tiger Attack

ఉత్తమ కథలు