• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • SHOCKING VIRAL VIDEO PERSON STAND IN FRONT OF RUNNING TRAIN PUSHED IT BY FOOT VIRAL VIDEO SHARED BY HARSH GOENKA NK

Viral Video: పట్టాలపై రైలు... ఎదురుగా యువకుడు... కాలితో తన్ని వెనక్కి పంపేశాడుగా...

Viral Video: పట్టాలపై రైలు... ఎదురుగా యువకుడు... కాలితో తన్ని వెనక్కి పంపేశాడుగా...

పట్టాలపై రైలు... ఎదురుగా యువకుడు... కాలితో తన్ని వెనక్కి పంపేశాడుగా... (image credit - twitter)

Viral Video: కరోనా వ్యాక్సిన్ 2 డోసులు వేసుకుంటే... మనలో కాన్ఫిడెన్స్ ఎంత పెరుగుతుంది? మనలో కరోనా భయం ఎంత తగ్గుతుంది? ఈ వైరల్ వీడియోలో ఆన్సర్ చూడండి.

  • Share this:
    Viral Video: కరోనాను కూడా కామెడీ చేసేస్తున్నారు కొందరు. కరోనా వస్తే రానీ... ఏంటట అనే కాన్ఫిడెన్స్ వారి వీడియోల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరొకటి వైరల్ అయ్యింది. ఇందులో ఓ యువకుడు... 2 డోసుల కరోనా వైరస్ తీసుకుంటే... దేశ ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఎంతలా పెరుగుతుందో ఫన్నీగా చూపించాడు. రైలు వస్తుండగా పట్టాలపైకి వెళ్లిన యువకుడు... రొమ్ము చాచి... ధైర్యంగా నిలబడ్డాడు. రైలు దగ్గరి దాకా వచ్చాక... పట్టాల పైనుంచి పక్కకు తప్పుకుంటాడని మనం అనుకుంటాం. కానీ అందుకు విరుద్ధంగా ఆ కుర్రాడు రైలు దగ్గరి దాకా వచ్చినా పట్టాలపైనే ఉన్నాడు. అంతే కాదు సినిమాల్లోలాగా... కాలితో రైలును గట్టిగా తన్నాడు. అంతే... రైలు ఎలా వచ్చిందో అలాగే వెనక్కి వెళ్లిపోయింది.

    ఇది పూర్తిగా గ్రీన్‌ మ్యాట్ చేసిన గ్రాఫిక్ వీడియో. కానీ దీన్ని చూసిన వాళ్లకు ఇది నిజమైన వీడియోనే అన్నట్లుగా ఉంది. రైలును తన్నిన తర్వాత అతను అదే పట్టాలపై నడుస్తూ... వెనక్కి వెళ్లిపోతున్న రైలును చూసి... అదీ మరి కాన్ఫిడెన్స్ అంటే అన్నట్లుగా చూస్తుండటం అందరికీ ఫన్నీగా అనిపించింది. భోజ్‌పురి సినిమాలను గుర్తుచేస్తున్న ఈ వీడియోను చాలా మంది చూస్తున్నారు. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. వీడియో మీరూ చూడండి.



    వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా... ఫన్నీ కాప్షన్ పెట్టారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుంటే... ఇక కరోనా ఎందుకు సోకుతుంది అని అడిగారు. ఐతే... ఈ కామెంట్ వెనక ఓ సెటైర్ కూడా ఉంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్న వారిలో కొంత మంది బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారనీ... వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి ఇక మాకు కరోనా రాదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉంటున్నారనే విమర్శ ఉంది. అలాంటి వారి వల్ల కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోందన్నది హర్ష గోయెంకా ఉద్దేశంగా తెలుస్తోంది.

    ఇది కూడా చదవండి: Happy Easter Sunday 2021: హ్యాపీ ఈస్టర్ సండే... ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకోండి

    రియాలిటీ ఎలా ఉన్నా... ఈ వీడియోను మాత్రం నెటిజన్లు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కొన్ని క్షణాలపాటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: